Monkey Business: శ్రీలంక అరుదైన కోతులను చైనాకు ఎగుమతి.. సరికొత్త ప్రయోగం చేస్తుందంటూ సర్వత్రా ఆందోళన
చైనా తన జంతుప్రదర్శనశాలల కోసం ఈ కోతులను కోరుకుంటోందని శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీర అన్నారు. శ్రీలంక ఎప్పుడూ సజీవ జంతువులను ఎగుమతి చేయదని, అయితే శ్రీలంక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ విక్రయం జరుగుతోందని ఆయన అన్నారు.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. లంక ఇప్పుడు చైనాకు భారీగా అరుదైన కోతులను ఎగుమతి చేస్తోంది. తాము చైనాకు 1,00,000 కోతులను ఎగుమతి చేస్తున్నామని వస్తున్న వార్తలను శ్రీలంక అధికారులు ధృవీకరించారు. చైనాలోని ప్రైవేట్ కంపెనీ జూలాజికల్ గార్డెన్ కి తాము కోతులను ఎగుమతి చేస్తున్నామని శ్రీలంక వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి గుండాస సమరసింఘే తెలిపారు. చైనా ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖను కోతులను ఎగుమతి చేయమని అభ్యర్థించారు. దీంతో తాము మొత్తం 1,00,000 కోతులను ఒకే సారి పంపించినట్లు చెప్పారు. అయితే కోతులను ఎగుమతి చేయడం వలన కలిగే నష్టం గురించి తెలుసు అని చెప్పారు.
ఈ కోతులను రక్షిత ప్రాంతం నుండి సేకరించలేదు. బదులుగా.. వ్యవసాయ ప్రాంతాల నుండి కోతులను సేకరించనున్నామని. తద్వారా అవి పంటలకు హాని కలగదని పేర్కొన్నారు. టోట్ మకాక్ కోతి శ్రీలంకలోని స్థానిక జాతి . ఈ కోతుల జాతులు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో కోతులను ఎగుమతి చేయడం పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
ఒకేసారి 1,00,000 కోతులను ఎగుమతి చేస్తుందా ‘టోక్ మకాక్’ అనే కోతులు శ్రీలంకకే చాలా ప్రత్యేకం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం.. అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఇవి ఉన్నాయి. దీంతో ఈ ప్రతిపాదనపై పర్యావరణ వేత్తల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత వితానాజ్.. అంతరించిపోతున్న ఈ కోతుల మొదటి బ్యాచ్‌ను ప్రాక్టికల్ కోసం చైనాకు పంపనున్నట్లు తెలిపారు. గతంలో, చైనాకు కోతులను ఎగుమతి చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై వ్యాఖ్యానించిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ..కోతులను ఎగుమతి చేయడం సాధ్యమైతే, నెమళ్లను కూడా ఎగుమతి చేయాలని అన్నారు.
చైనా తన జంతుప్రదర్శనశాలల కోసం ఈ కోతులను కోరుకుంటోందని శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీర అన్నారు. శ్రీలంక ఎప్పుడూ సజీవ జంతువులను ఎగుమతి చేయదని, అయితే శ్రీలంక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ విక్రయం జరుగుతోందని ఆయన అన్నారు. నగదు కొరతతో ఉన్న శ్రీలంక ఈ సంవత్సరం రక్షిత జాబితా నుండి అనేక జాతులను తొలగించింది.. అందులో మూడు కోతుల జాతులు అలాగే నెమళ్ళు , అడవి పందులతో సహా అనేక జంతువులున్నాయి.
టోక్ మకాక్ కూడా ప్రజలపై దాడి చేస్తుంది ‘టోక్ మకాక్ శ్రీలంకలోని అనేక ప్రాంతాలలో పంటలను నాశనం చేస్తుంది. అప్పుడప్పుడు ప్రజలపై దాడి చేస్తుంది. శ్రీలంకలోని అధికారులు దేశంలో కోతుల జనాభా రెండు నుంచి మూడు మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఇంతలో, కొలంబోలోని చైనా రాయబార కార్యాలయం “ప్రయోగాత్మక ప్రయోజనాల” కోసం చైనా ప్రైవేట్ కంపెనీకి “100 వేల” “అంతరించిపోతున్న” టోక్ మకాక్ కోతులను ఎగుమతి చేయాలనే శ్రీలంక నిర్ణయం గురించి తమకు తెలియదని చెబుతోంది.
అయితే శ్రీలంక నుంచి దిగుమతి చేసుకున్న లక్ష కోతులపై ప్రపంచానికి చైనా మళ్ళీ అబద్ధాలు చెబుతోందని చైనా మళ్లీ జంతువులపై పెద్ద ప్రయోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు టోక్ మకాక్ కోతి అనేది శ్రీలంకలో అరుదైన జాతి. క్రమంగా ఈ జాతి అంతర్జాతీయ స్థాయి నుండి కనుమరుగవుతోంది కనుక కోతులు ఎగుమతి పై పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..