Viral News: టైటానిక్ షిప్ గురించి వెలుగులోకి మరో కొత్త విషయం..! ఆ రోజు ప్రయాణికులు ఏం తిన్నారో తెలుసా..?

లగ్జరీ క్రూయిజ్ షిప్ టైటానిక్ ఏప్రిల్ 15, 1912న ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుండి యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌కు ప్రయాణిస్తున్నప్పుడు మునిగిపోయింది. దురదృష్టకరమైన ఓడ విషాద కథపై అనేక డాక్యుమెంటరీలు, సినిమాలు కూడా రూపొందించబడ్డాయి.

Viral News: టైటానిక్ షిప్ గురించి వెలుగులోకి మరో కొత్త విషయం..! ఆ రోజు ప్రయాణికులు ఏం తిన్నారో తెలుసా..?
Titanic Ship
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 21, 2023 | 7:30 AM

టైటానిక్ పేరు వినగానే చాలు అందరికీ ఒక భయంకరమైన విషాదం గుర్తుకు వస్తుంది. టైటానిక్‌గా పిలువబడే ఈ లగ్జరీ షిప్ చుట్టూ ఇప్పటికీ వీడని అనేక రహస్యాలు మిస్టరీగానే మిగిలిఉన్నాయి. ఆ రహస్యాలు ఇప్పటికీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓడ మునిగిపోయి 100 ఏళ్లు గడిచినా, దాని గురించిన అనేక రహస్యాలు ఇప్పటికీ ప్రజలను భయపెడుతున్నాయి. లగ్జరీ షిప్‌ టైటానిక్‌ గురించి చాలా మందిని ఇప్పటికీ చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే, అత్యంత విలాసవంతమైన ఓడగా పేరొందిన టైటానిక్ మునిగిపోయిన ఆ రోజు తన ప్రయాణీకులకు అందించిన ఆహారానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది..

టైటానిక్ మునిగిపోయి100 సంవత్సరాలు దాటినా  ఇప్పటికీ అత్యంత ప్రసిద్ధ ప్యాసింజర్ లైనర్ టైటానిక్. 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి.. 15వ తేదీ తెల్లవారుజాము సమయంలో టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఇది ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరకముందే మంచు శకలాన్ని ఢీకొట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దురదృష్టకరమైన ఓడ విషాద కథపై అనేక డాక్యుమెంటరీలు, సినిమాలు కూడా రూపొందించబడ్డాయి. అయితే లగ్జరీ షిప్ లో ప్రయాణికులకు ఆ ఆఖరు రోజున ఎలాంటి ఆహారం ఇచ్చారో తెలుసా? అత్యంత విలాసవంతమైన ఓడగా పేరొందిన టైటానిక్ తన ప్రయాణికులకు ఎలాంటి సేవలందిస్తుందో ఎప్పుడైనా ఊహించారా?

టైటానిక్‌ మునిగిపోయి 111వ వార్షికోత్సవం సందర్భంగా టేస్ట్‌ అట్లాస్‌ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓడలో అందించిన ఆహారం గురించిన సమాచారాన్ని అందించింది. మెనూల ఫోటోలను షేర్‌ చేసారు. ఏప్రిల్ 15వ తేదీ రాత్రి ఓడ మునిగినప్పుడు, ప్రయాణికులకు చికెన్ కూర, చేపల ఫ్రై, మటన్ కర్రీ మొదలైన రుచికరమైన వంటకాలను అందించారు. సెకండ్‌ క్లాస్ ప్రయాణికుల కోసం పాయసం సిద్ధం చేశారు. వైరల్‌ అవుతున్న ఈ ఫోటో ఆధారంగా మూడు కేటగిరీల మెనూల మధ్య చాలా వ్యత్యాసం ఉందని టేస్ట్ అట్లాస్ పోస్ట్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి
Titanic

Titanic

ఫస్ట్ క్లాస్ ప్రయాణీకుల మెనూ.. విందు భోజనాన్ని మించి ఉందన్నారు. కార్న్డ్ బీఫ్, వెజిటేబుల్స్, గ్రిల్డ్ మటన్ చాప్స్, కస్టర్డ్ పుడ్డింగ్, రొయ్యలు, నార్వేజియన్ ఆంకోవీస్, వివిధ రకాల చీజ్‌లు అనేక ఇతర వంటకాలు ఉన్నాయి. అయితే, థార్డ్‌ క్లాస్‌ ఆన్‌బోర్డ్‌లో అల్పాహారం, రాత్రి భోజనం కోసం పరిమిత వంటకాలు అందించారు. ఇది వోట్మీల్ గంజి, పాలు, బంగాళదుంపలు, గుడ్లు, బ్రెడ్‌, బట్టర్‌, మార్మాలాడే మరియు స్వీడిష్ బ్రెడ్‌ మెనూలో ఉంది. అయితే, ప్రయాణీకుల తరగతితో సంబంధం లేకుండా, టైటానిక్ టేస్ట్ అట్లాస్ ప్రకారం అందరికీ విలాసవంతమైన భోజనాన్ని అందించింది.

ప్రస్తుతం, ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓడలోని డైనింగ్ హాల్స్ వైభవాన్ని చూసి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. మరికొందరు వివిధ తరగతులకు వడ్డించే ఆహారంలో గల వ్యత్యాసాలను గురించి కూడా నెటిజన్లు తీవ్రంగా  చర్చించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..