పాపం.. కోళ్లకోసం వచ్చిన భల్లూకం బావిలో పడింది.. అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్..
కోడిని పట్టుకునే ప్రయత్నంలో రెండు కోళ్లను పట్టుకుని బావిలో పడిపోయినట్టుగా గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు బావిలోని నీటిని బయటకు పంపింగ్ చేసి వల సాయంతో ఎలుగుబంటిని బయటకు తీసిన ఫారెస్ట్ సిబ్బంది
కేరళ రాజధాని త్రివేండ్రం సమీపంలో ఓ ఎలుగుబంటి బావిలో పడిపోయింది. అటవీప్రాంతం నుంచి నగరం వైపు వచ్చిన భల్లూకం అనుకోకుండా ఓ ఇంట్లోని బావిలో పడిపోయింది. లోతైన బావిలో పడ్డ భల్లూకం శబ్దాలు విన్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఎలుగుబంటిని రక్షించేందుకు కేరళ అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. బుధవారం రాత్రి కన్నంపల్లికి చెందిన ప్రభాకరన్ ఇంట్లోని బావిలో ఎలుగుబంటి పడిపోయినట్టుగా సమాచారం అందుకున్న అధికారులు, అటవీ సిబ్బంది.. ఎలుగుబంటి మునిగిపోకుండా ఉండేందుకు బావి గోడను పట్టుకుని వేలాడబడినట్టుగా గుర్తించారు. ఎలుగుబంటిని పైకి లేపడానికి బావిలో తాడు నెట్‌ను అమర్చారు. కానీ ట్రాంక్విలైజర్ ప్రభావంతో ఎలుగుబంటి క్రమంగా జారిపడి మునిగిపోయింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు బావిలోని నీటిని బయటకు పంపింగ్ చేసి వల సాయంతో ఎలుగుబంటిని బయటకు తీశారు.. రెస్క్యూ మిషన్ కోసం వచ్చిన అధికారులు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జంతువును ఎట్టకేలకు రక్షించారు.
#WATCH | Kerala: A bear that fell in a well in the Vellanad area of rural Thiruvananthapuram was successfully rescued. pic.twitter.com/EbvqspAlT7
ఇవి కూడా చదవండి— ANI (@ANI) April 20, 2023
ఎలుగుబంటి ప్రభాకరన్ పెంచుతున్న కోళ్లను పట్టుకోవడానికి వచ్చినట్లు భావిస్తున్నారు. కోడిని పట్టుకునే ప్రయత్నంలో రెండు కోళ్లను పట్టుకుని బావిలో పడిపోయినట్టుగా గుర్తించారు. బావిలో పడ్డ భల్లూకంపై మత్తుమందు ప్రయోగించారు. తరువాత భారీ వల సాయంలో ఎలుగుబంటిని బయటకు తీశారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..