China : తమని బీట్ చేసిన భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన డ్రాగన్ కంట్రీ .. సంఖ్య కంటే..నాణ్యత ముఖ్యం అంటూ సరికొత్త రాగం..

తమ దేశ జనాభాను పెంచుకునే పనిలో రకరకాల యూత్ ను ఆకర్షించేందుకు రకరాల పథకాలను ప్రవేశపెడుతూ నానా తిప్పలు పడుతోంది. పుండు మీద కారం జల్లినట్లు.. ఇప్పుడు చైనా పాపులేషన్ ను భారత్ దాటినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా మరోసారి తన అక్కసుని వెళ్లగక్కింది.

China : తమని బీట్ చేసిన భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన డ్రాగన్ కంట్రీ .. సంఖ్య కంటే..నాణ్యత ముఖ్యం అంటూ సరికొత్త రాగం..
China Downplays India populous
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2023 | 8:35 AM

జనాభా ఎక్కువగా ఉండటం కూడా బలమే.. తమకు ఉన్న జనాభాను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వాల దగ్గర మంచి ప్లానింగ్ ఉండాలి అంతే.. అది అర్ధం చేసుకున్న చైనా ప్రభుత్వం అభివృద్ధి పథంలో రాకెట్ వేగంలో దూసుకుపోయింది. దీనికి కారణం అత్యధిక జనాభానే ఒకప్పుడు చోధక శక్తిగా నిలిచిందన్నది జగమెరిగిన సత్యం.. అయితే జనాభా అదుపులో భాగంగా తీసుకున్న చర్యలతో ఇపుడు డ్రాగన్ కంట్రీలో జననాల రేటు ఆగిపోయాయి. వృద్ధులు పెరిగిపోయారు. దీంతో తమ దేశ జనాభాను పెంచుకునే పనిలో రకరకాల యూత్ ను ఆకర్షించేందుకు రకరాల పథకాలను ప్రవేశపెడుతూ నానా తిప్పలు పడుతోంది. పుండు మీద కారం జల్లినట్లు.. ఇప్పుడు చైనా పాపులేషన్ ను భారత్ దాటినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా మరోసారి తన అక్కసుని వెళ్లగక్కింది. వివరాల్లోకి వెళ్తే..

ప్రపంచంలో అత్యధిక జనాభాకలిగిన దేశంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న చైనాను బీట్ చేసిన భారత్ మొదటి ప్లేస్ లో నిలిచింది. . 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. అధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ను అధిగమించడాన్ని చైనా జీర్ణించించుకోలేకపోతోంది. తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించింది. జనాభా ఎక్కువ ఉండడం పెద్ద విషయం కాదని.. క్వాలిటీ కంటే.. క్వాంటిటీ ముఖ్యం అంటూ తన అక్కసుని వెళ్లగక్కింది.

ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లు.. తమ దేశ అభివృద్ధికి బలమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఇప్పటికీ 900 మిలియన్ల మంది “నాణ్యమైన” శ్రామికశక్తిని కలిగి ఉన్నామని.. ఇక చదువు విషయంలో కూడా  సగటున 10.5 ఏళ్ల పాటు విద్యనభ్యసించిన వారు ఉన్నారని చైనా బుధవారం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మీడియా సమావేశంలో భారత్ దేశ జనాభా గురించి మాట్లాడుతూ..  ఒక దేశ జనాభా డివిడెండ్‌ను అంచనా వేసేటప్పుడు.. జనాభా లెక్కను మాత్రమే కాదు.. ఆ జనాభా నాణ్యతను కూడా చూడాలని అన్నారు.  వృద్ధాప్య జనాభాను ఎదుర్కోవడానికి చైనా చురుకైన చర్యలు చేపట్టిందని వాంగ్ చెప్పారు.

ఓ వైపు పడిపోతున్న జనన రేటు.. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా కారణంగా చైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.  దేశంలో జననాల రేటు 8.50 లక్షల మంది తగ్గి 1.4118 బిలియన్లకు చేరుకుంది. చైనాలో జనాభా ప్రతికూల దశలోకి ప్రవేశి.. 2022లో చైనాలో జనాభా  సంక్షోభం తీవ్రమైంది .చైనా మొత్తం జనాభా సంవత్సరానికి 850,000 మంది తగ్గి 2022లో 1.4118 బిలియన్లకు చేరుకుంది..  సహజ వృద్ధి రేటు ప్రతి 1,000 మందికి 0.6 ప్రతికూలంగా ఉందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్  ఈ ఏడాది జనవరిలో తెలిపింది.

2020 చివరినాటికి నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకారం.. చైనాలోని ప్రధాన భూభాగంలో 60 ఏళ్లు పైబడిన 264 మిలియన్ల మంది ఉన్నారు  ఈ వృద్ధ జనాభా మొత్తం 400 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేశారు. 2035 నాటికి చైనా జనాభాలో 30 శాతానికి పైగా వృద్ధులు ఉండనున్నారని లెక్కలు చెబుతున్నారు.

అయితే ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. భారతదేశ జనాభాలో 0-14 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 25 శాతం మంది, 10 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 18 శాతం, 10 నుండి 24 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 26 శాతం మంది, 15 నుండి 64 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 68 శాతం,  65 సంవత్సరాల కంటే ఎక్కువ మంది 7 శాతం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..