AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russian Woman: పవిత్ర స్థలంలో నగ్నంగా ఫొటోలు.. నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్.. చివరకు ఏమైందంటే..?

ఇండోనేషియాలోని పవిత్ర బాలిలో ఓ మహిళ చేయరాని పనిచేసి.. బహిష్కరణకు గురైంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం బాలిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే లూయిజా కోసిఖ్‌ అనే 40 ఏళ్ల మహిళ బాలిలోని 700 ఏళ్ల నాటి..

Russian Woman: పవిత్ర స్థలంలో నగ్నంగా ఫొటోలు.. నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్.. చివరకు ఏమైందంటే..?
Luiza Kosykh
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 19, 2023 | 6:22 PM

Share

ఇండోనేషియాలోని పవిత్ర బాలిలో ఓ మహిళ చేయరాని పనిచేసి.. బహిష్కరణకు గురైంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం బాలిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే లూయిజా కోసిఖ్‌ అనే 40 ఏళ్ల మహిళ కొన్నేళ్ల క్రితం బాలిలోని 700 ఏళ్ల నాటి మర్రి చెట్టు ముందు నగ్నంగా ఫోటో తీయించుకుంది. అంతటితో ఆగక ఆ నగ్న ఫోటోను ఏకంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే లూయిజా కోసిఖ్‌ షేర్ చేసిన ఆ నగ్న ఫోటో.. ఆ దేశంలోని హిందువుల కంట పడడంతో వారు తీవ్రంగా ఆగ్రహించారు. సమాచారం అధికారుల వరకు చేరడంతో వారు రంగంలోకి దిగి లూయిజా కోసిఖ్‌ను బాలి నుంచి బహిష్కరించడంతో పాటు అరెస్ట్ చేశారు.

Luiza Kosykh

Luiza Kosykh (Instagram)

అయితే లూయిజా కోసిఖ్‌ బాలిలోని న్‌పసర్ నుంచి మాస్కోకు ఆదివారం చివరి విమానంలో బయలుదేరిందని బాలి లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఏజెన్సీ అధికారి ఐ నెంగా సుకదానా తెలిపారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో ఆమెను గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. ఫోటో విషయమై లూయిజా కోసిఖ్‌ మాట్లాడుతూ ‘మర్రి చెట్టు ముందు ఉన్న నగ్న ఫోటో చాలా సంవత్సరాల క్రితం దిగినది. ఆ మర్రి చెట్టును పవిత్రంగా భావిస్తారని నాకు తెలియదు’ అని తెలిపింది.

కాగా, గతేడాది మే నెలలో కూడా బాలిలోని ఈ పురాతన మర్రి చెట్టు కింద అలీనా ఫాజ్లీవా, అమె భర్త నగ్నంగా ఫోటోలు దిగారు. వారు కూడా సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను షేర్ చేయడంతో అధికారుల కంట పడి బహిష్కరణకు గురయ్యారు. అలాగే అదే ఏడాది ఏప్రిల్ నెలల కెనడియన్ నటుడు, వెల్నెస్ గురు జెఫ్రీ క్రెగెన్‌ను కూడా ఇదే కారణంతో ఇండోనేషియా ప్రభుత్వం బహిష్కరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..