- Telugu News Photo Gallery Viral photos Viral Photos: North Carolina Woman Goes Viral For Divorce Photo Shoot
Divorce Photo Shoot: “నేను విడాకుల తీసేసుకున్నానోచ్..” పెళ్లి డ్రెస్, ఫోటోలు తగలబెట్టి మరీ సెలబ్రేషన్స్
అమెరికాలోని నార్త్ కరోలినాలో చాలా ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యువతి తాను విడాకులు తీసుకున్నానని.. ఇప్పుడు చాలా సంతోషముగా ఉన్నానని.. తన పెళ్లి దుస్తులను తగలబెట్టింది. అంతే కాదు, ఈ సంఘటనకు సంబంధించి నవ్వుతూ ఫోటోషూట్ కూడా చేసింది.
Updated on: Apr 19, 2023 | 2:00 PM

అమెరికాలోని నార్త్ కరోలినాలో చాలా ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యువతి తాను విడాకులు తీసుకున్నానని.. ఇప్పుడు చాలా సంతోషముగా ఉన్నానని.. తన పెళ్లి దుస్తులను తగలబెట్టింది. అంతే కాదు, ఈ సంఘటనకు సంబంధించి నవ్వుతూ ఫోటోషూట్ కూడా చేసింది.

హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు..ప్రపంచంలో ఎక్కడైనా సరే పెళ్లి అనేది జన్మజన్మల బంధంగా భావించబడుతుంది. ప్రస్తుత కాలంలో వివాహ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం లేదు. జన్మ జన్మల వరకూ కొనసాగాల్సిన వివాహ బంధం.. ఇప్పుడు కేవలం కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో విచ్ఛిన్నమవుతున్నాయి.

సాధారణంగా ప్రజలు తమ వివాహం విచ్చిన్నమైతే దుఃఖంతో జీవిస్తారు. అయితే ప్రస్తుతం ఒక మహిళ విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. తాను విడాకులు తీసుకున్నా అంటూ వేడుకగా జరుపుకుంది. ప్రపంచానికి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

వాస్తవానికి భర్త నుండి విడిపోయిన తర్వాత.. అంటే, విడాకుల తర్వాత మహిళ తన పెళ్లి దుస్తులను తగలబెట్టింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోషూట్ కూడా చేయించుకుంది. మహిళ తన విడాకులను సెలబ్రేట్ చేసుకున్న చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏడుపుకు దూరంగా.. పంజరం నుంచి స్వాతంత్య్రం పొందిన చిలుకగా చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది.

ఈ మహిళ పేరు లారెన్ బ్రూక్. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 31 ఏళ్ల లారెన్ 2012 సంవత్సరంలో వివాహం చేసుకుంది. లారెన్ ఇద్దరు పిల్లలకు తల్లి 10 సంవత్సరాలలో వివాహ బంధానికి విడాకులతో తెర దింపేసింది.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విడాకుల తర్వాత ఫోటోషూట్ సమయంలో లారెన్ తల్లి కూడా సహాయపడింది. లారెన్‌కు ఈ క్షణం చాలా ఆనందంగా ఉందని.. ఫోటోషూట్ సమయంలో తాను అస్సలు బాధపడలేదని, రోజంతా ఆనందంగా గడిపానని చెబుతోంది అమెరికా నివాసి లారెన్.

లారెన్ ప్రత్యేకమైన ఫోటోషూట్ అంటే విడాకులు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఆమె తన పెళ్లి దుస్తులను విసిరివేసి కాల్చినట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఆమె పెళ్లి చిత్రాన్ని కూడా రెండు ముక్కలుగా చేసింది.
