- Telugu News Photo Gallery World photos Spanish Athlete beatriz flamini spending 500 days in a cave know how
Spanish Athlete: ప్రపంచానికి దూరంగా గుహలో 500 రోజులు గడిపిన మహిళ.. ఈ ఘనత సాధించిన అథ్లెట్
సోషల్ మీడియా యుగంలో.. ఒక వ్యక్తి 500 రోజులు ప్రపంచానికి దూరంగా ఉండగలడని ఎవరైనా ఊహించగలరా? అయితే స్పానిష్ అథ్లెట్ మాత్రం తాను అందరికంటే భిన్నం అంటూ ప్రపంచానికి దూరంగా ఉంది. స్పెయిన్‌లోని గ్రెనడాలో ఉన్న గుహలో 500 రోజులు ఒంటరిగా గడిపి ఇటీవలే బయటకు వచ్చింది. ఈ ఫీట్ చేసిన 50 ఏళ్ల ఈ అథ్లెట్ పేరు బీట్రిజ్ ఫ్లామిని. ప్రస్తుతం బీట్రిజ్ ఫ్లామిని శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉంది. బీట్రిజ్ ఫ్లామిని సాధించిన ఈ ఘనత ప్రపంచ రికార్డుకు కూడా పంపబడింది
Updated on: Apr 20, 2023 | 12:34 PM

బీట్రిజ్ ఫ్లామిని 21 నవంబర్ 2021న గుహలోకి ప్రవేశించింది. అప్పటికి ఆమె వయసు 48 ఏళ్ల కొన్ని నెలలు. తన రెండు పుట్టినరోజులను గుహలోనే జరుపుకుంది. బీట్రిజ్ ఈ ఫీట్ చేసేందుకు చేసిన సహాయక బృందం మాట్లాడుతూ.. 500 రోజులలో.. ఆమె దాదాపు 60 పుస్తకాలు చదివింది, 1,000 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగిందని చెప్పారు. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదన్నారు.

బీట్రిజ్ గుహ లోపల తన అనుభవాలను వివరించింది. గుహలో ఉన్న సమయంలో రోజులు లెక్కించలేదని చెప్పింది. తాను గుహలో గడిపిన అత్యంత కష్టతరమైన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. తేనెటీగలు దాడి చేసిన సమయం అని చెప్పింది. గత 500 రోజులుగా నీళ్లు మాత్రమే తాగాను. ఇప్పుడు నేను స్నానం చేయాలనుకుంటున్నాను.. అయితే శాస్త్రవేత్తలు అలా చేయకూడదని నివారించినట్లు పేర్కొంది.

బీట్రిజ్.. గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మొదట తన బంధువులను, సహాయక బృందాన్ని కౌగిలించుకుంది. తాను గుహలో ఉన్న సమయంలో ప్రపంచం మారిపోయిందని చెప్పింది. 21 నవంబర్ 2021 న గుహలోకి వెళ్ళినప్పుడు.. కంటే గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచం మారిపోయిందని చెప్పింది. ప్రస్తుతం బీట్రిజ్ పరిస్థితిపై శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచారు. బీట్రిజ్ గుహలో ఎక్కువ కాలం ఉండి రికార్డు సృష్టించారని ఆమె సహాయక బృందం అభిప్రాయపడింది.

ఇప్పటి వరకు అత్యధిక రోజులు గుహలో నివసించడం గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఈ రికార్డు రాగి బంగారు గనిలో 69 రోజులు గడిపిన 33 మంది చిలీ, బొలీవియన్ గని కార్మికుల పేరు మీద ఉంది. 2010లో గని కూలిపోవడంతో అప్పుడు ఆ కూలీలు అక్కడే చిక్కుకుపోయారు.