- Telugu News Photo Gallery World photos Population: Countries that don’t even have a population of one lakh.. have a look
Least Population: ఈ దేశాల్లో సౌకర్యాలు అధికం.. జనాభా లక్ష కంటే తక్కువే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను వెనక్కి నెట్టి భారత దేశం ఫస్ట్ ప్లేస్ కు వచ్చింది. ప్రస్తుతం భారత దేశ జనాభా 142.86 కోట్లు. వరసగా మూడు స్థానాల్లో భారత్, చైనా, అమెరికాలు నిలిచాయి. అయితే ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశాలు అంటే కనీసం లక్ష జనాభా కూడా లేని ప్రాంతాల గురించి తెలుసుకుందాం..
Updated on: Apr 21, 2023 | 11:51 AM

ప్రపంచంలో అతి చిన్న దేశంగా ఖ్యాతిగాంచిన వాటికన్ సిటీలో కేవలం 518 మంది నివసిస్తున్నారు. ఈ దేశం విస్తీర్ణం కూడా చదరపు కిలోమీటరు లోపే ఉంటుంది. ఇక్కడ మతబోధకులు, నన్‌లు కనిపిస్తారు. అత్యాధునిక సౌకర్యలున్న ఈ నగరంలో ఒక్క స్క్వేర్‌లో దాదాపు 80 వేల మందికి వసతి కల్పించవచ్చు. ఇక్కడ నివాసిస్తున్న పోప్ ను దర్శించుకోవటానికి, అతను ఇచ్చే సందేశాన్ని వినేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకుడు ఈ సిటీకి చేరుకుంటారు.

ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న దేశం హవాయ్. ఇక్కడ 11,396 మంది నివసిస్తున్నారు. ఈ దేశం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నివసించే స్థానికులు తమ పూర్వీకుల జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. సంస్కృతి, సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కొబ్బరితో తయారు చేసే ఆహారం ప్రధాన ఆహారం.

నౌరు ద్వీప దేశంలో జనాభా కేవలం 12,780. 21 చదరపు కిలోమీటర్లలో ఉంది. ఇక్కడ జనాభా ప్రధానంగా వ్యవసాయం చేస్తారు. అనాస, అరటి, కొబ్బరి, రకరకాల కూరగాయలను పండిస్తారు. ఇక్కడ నివసించే జనాభా అత్యంత సంతోషంగా జీవిస్తారు. ఫాస్పేట్ తవ్వకాల కారణంగా ఇక్కడున్న 80 శాతం భూమి నాశనమైందని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పసిఫిక్ దీవుల్లోని దేశం పలౌలో 18,058 మంది నివసిస్తున్నారు. 459 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ దేశం. ఇక్కడ అందమైన ద్వీపాలు పర్యటకులను అలరిస్తాయి. 1914-44 వరకు ఈ దేశం జపాన్ అధీనంలో ఉండగా అనంతరం అమెరికా చేతుల్లోకి వెళ్ళింది. 1994లో పలౌ స్వతంత్ర దేశంగా అవతరించింది.

ఒక చిన్న చర్చి నిర్మాణంతో నేడు ఒక దేశంగా రూపొందింది శాన్ మారినో. ఇక్కడ 33,642 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశం 61 చదరపు కిలోమీటర్లలో ఉంది. కష్టాల కడలి నుంచి బయటపడిన శాన్ మారినో ఇప్పుడు తలసరి ఆదాయంలో మంచి అభివృద్ధి సాధించింది. దేశం నడిబొడ్డున టైటానో పర్వతంపై నిర్మించిన గ్వైటా కోట పర్యాటకులను ఆకర్షిస్తుంది.

పర్యాటకులను అత్యధికంగా ఆకర్షించే దేశం మొనాకో. ఇక్కడ కేవలం 36,297 మంది నివసిస్తున్నారు. 2 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఈ దేశం విస్తీర్ణం ఇక్కడ నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 32 శాతం మంది ధనవంతులే.

స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్యలో ఉన్న లైకెస్టీన్‌లో 39,584 మంది ప్రజలు నివసిస్తున్నారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం అత్యధికం.. ప్రధాన భాష జర్మన్ భాష. ఈ దేశం ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

పసిఫిక్ మహాసముద్రంలోని మైక్రోనేషియా లో ఉన్న దేశం మార్షల్ ఐలాండ్స్. ఇక్కడ 41,996 మంది జీవిస్తున్నారు. 181 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. పగడపు దిబ్బలు దీవులు ప్రపంచ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తాయి. స్కూబా డ్రైవింగ్ ని ఇష్టపడేవారు ఎక్కువగా ఈ దేశాన్ని సందర్శిస్తారు.

కరీబియన్ దేశం వెనెజువెలాకు ఉత్తర దిశలో ఉన్న దేశం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్. ఈ దేశ జనాభా 47,755 మంది. 261 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. చెరకు ఇక్కడి ప్రధాన ఆహార పంట. ప్రతి సంవత్సరం ఈ దేశాన్ని చూసే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ దేశం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతోంది.

వలస కార్మిక ఆఫ్రికన్ తో నిండి ఉన్న ద్వీప దేశం డొమినికా.. ఇక్కడ 73,040 మంది జనాభా నివసిస్తున్నారు. 751 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశంలో ఎక్కువ వర్షారణ్యాలు, అగ్నిపర్వతాలు, కాఫీ తోటలు కనిపిస్తాయి.





























