AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mali Kanjanaphuping: ఓ మోడల్ అందం కోసం బుగ్గలకు చౌకైన ఇంజెక్షన్.. తీరా అసలు విషయం తెలిసి షాక్..

ఒకొక్కసారి  చౌక ధరకు లభించే వస్తువులు వినియోగదారులకు హానికరంగా మారతాయి. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ విషయంలో కూడా అలాంటిదే చోటు చేసుకుంది. చౌక వస్తువులను కొనుగోలు చేసుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.  

Mali Kanjanaphuping: ఓ మోడల్ అందం కోసం బుగ్గలకు చౌకైన ఇంజెక్షన్.. తీరా అసలు విషయం తెలిసి షాక్..
Mali Kanjanaphuping
Surya Kala
|

Updated on: Apr 20, 2023 | 10:42 AM

Share

భారతీయులు మాత్రమే కాదు.. ,ప్రపంచంలోని ప్రజలందరూ ఉచిత వస్తువులు లేదా చౌక వస్తువులను ఇష్టపడతారు. ముఖ్యంగా సామాన్యుడు ఇంటి రేషన్‌ నుంచి బట్టల వరకు అన్నీ తక్కువ ధరకే కొనుక్కోవాలని కోరుకుంటాడు. అందుకే వస్తువులు తక్కువ ధరకు లభించే ప్రదేశాలకు ప్రజలు తరచూ షాపింగ్‌కు వెళ్తుంటారు. అయితే ఒక్కోసారి చౌకధరల వస్తువులు కొనుగోలు చేసి  మోసపోతున్నారు. ఎందుకంటే తాము తక్కువ ధరకు కొన్న వస్తువులు కూడా మంచివేనని భావించేవారు ఎక్కువ. అయితే ఒకొక్కసారి  చౌక ధరకు లభించే వస్తువులు వినియోగదారులకు హానికరంగా మారతాయి. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ విషయంలో కూడా అలాంటిదే చోటు చేసుకుంది. చౌక వస్తువులను కొనుగోలు చేసుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.

ఈ మహిళ పేరు మాలి కంజనపుపింగ్, ఆమెకు 26 సంవత్సరాలు. ది సన్ నివేదిక ప్రకారం.. వృత్తిరీత్యా మోడల్. తాను ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంది మాలి. అయితే కాలక్రమంలో తన అందమైన ముఖం అందంగా కనిపించలేదు. బుగ్గలు లావు అయ్యాయనే ఫీలింగ్ వచ్చింది. నవ్వినప్పుడు తన మీద తనకున్న నమ్మకం లోపించినట్లు భావించింది. దీంతో మాలి తన బుగ్గలకు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా చేయడం వలన బుగ్గల నుంచి కొవ్వు తగ్గి సన్నబడతాయని భావించింది.

నివేదికల ప్రకారం మాలి తన బుగ్గలను తగ్గించుకోవడానికి థాయ్‌లాండ్‌లోని ఒక క్లినిక్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇంతకు ముందు ఈ క్లినిక్‌లో సర్జరీ చేయించుకుంది కనుక ఇక్కడికి వచ్చే ముందు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని భావించింది. 8 వేల రూపాయలకు బదులు ఫిల్లర్ ఇంజక్షన్ కోసం 6 వేల రూపాయలను మాత్రమే ఛార్జ్ చేసింది. మాలి సర్జరీకి క్లినిక్‌లో మంచి తగ్గింపు ఇచ్చారు. ఈ తగ్గింపు చూసి సర్జరీ చేయించుకుంది. మాలి తన బుగ్గలకు ఇంజెక్షన్లు చేయించుకుంది. అయితే ఈ ఇంజెక్షన్ తన అందమైన ముఖాన్ని అందహీనంగా చేస్తుందని అప్పుడు మాలి ఊహించలేదు.

ఇవి కూడా చదవండి

ఇంజక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే మాలి మొహం మొత్తం ఎర్రబడి మంట మొదలైంది. మొదట్లో చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చని, కొంత సమయంలో నయమవుతుందని అనుకున్నారు కానీ అది జరగలేదు. మాలి  ఇంజెక్షన్ చేయించుకున్న మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత.. తన ముఖాన్ని చూసుకుని షాక్ తింది. ముఖం మీద బొబ్బలు, దద్దుర్లు ఉన్నాయి.

మరో రెండు రోజుల తర్వాత పరిస్థితి మరింత దిగజారడంతో.. మాలి భయంతో మళ్ళీ తనకు ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు తెలిసింది. తన బుగ్గలకు నాణ్యత లేని ఇంజెక్షన్ చేసినట్లు పూత పూసినట్లు తెలిసింది. అందుకనే మాలి ముఖం వికృతమైంది. అయితే మాలి కళ్లకు ఎలాంటి హానీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..