Yemen Stampede: యెమెన్‌లో విషాదం.. తోఫా కోసం వెళ్లి 85 మంది దుర్మరణం.. వందలాది మందికి గాయాలు..
రంజాన్ పర్వదినానికి ముందు పశ్చిమాసియా దేశం యెమన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 85 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
రంజాన్ పర్వదినానికి ముందు పశ్చిమాసియా దేశం యెమన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 85 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. తొక్కిసలాట అనంతరం ఈ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నట్లు యెమెన్ పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని గురువారం వెల్లడించారు. రమదాన్ పండుగ సందర్భంగా రాజధాని సనాలో ఓ సంస్థ పేదలకోసం తోఫా కార్యక్రమం చేపట్టింది. దుస్తులతోపాటు డబ్బులు సైతం పేదలకు పంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో తోఫాను తీసుకునేందుకు అక్కడకు భారీగా జనం చేరుకున్నారు. తోఫా కోసం జనం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట సంభవించింది. దీంతో చాలామంది అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. వందలాది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..