Watch Video: నడిరోడ్డుపై చెంగు చెంగున పరిగెడుతున్న లేడి పిల్ల.. నమ్మలేకపోతున్న నెటిజన్లు.. ఏమంటున్నారంటే..?

‘చెంగు చెంగున పరిగెడుతున్న లేడి పిల్ల’ అంటూ స్త్రీలను వర్ణించడానికి ఎందదో కవులు, రచయితలు తమ పెన్నుతో రాశారు. అయితే నిజంగా లేడి పిల్లలు లేదా జింక పిల్లలు అలా పరిగెత్తడాన్ని ఎవరైనా చూశారా అంటే దాదాపుగా ఎవరు లేరు. ఇంకా లేడి పిల్లలు..

Watch Video: నడిరోడ్డుపై చెంగు చెంగున పరిగెడుతున్న లేడి పిల్ల.. నమ్మలేకపోతున్న నెటిజన్లు.. ఏమంటున్నారంటే..?
Young Deer Running On Road
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 23, 2023 | 12:06 PM

‘చెంగు చెంగున పరిగెడుతున్న లేడి పిల్ల’ అంటూ స్త్రీలను వర్ణించడానికి ఎందదో కవులు, రచయితలు తమ పెన్నుతో రాశారు. అయితే నిజంగా లేడి పిల్లలు లేదా జింక పిల్లలు అలా పరిగెత్తడాన్ని ఎవరైనా చూశారా అంటే దాదాపుగా ఎవరు లేరు. ఇంకా లేడి పిల్లలు ఎలా పరుగులు తీస్తాయో ఎవరికి తెలియదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ‘నిజమే లేడి పిల్లలు చెంగు చెంగున పరిగెత్తుతాయి. మేము కళ్లారా చూసేశామ’ని అంటారు. అవును, నడి రోడ్డుపై చెంగు చెంగున పరుగులు తీస్తున్న జింక పిల్ల వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు నమ్మలేకపోతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నడిరోడ్డు మీద ఓ జింక పిల్ల పరుగులు తీస్తూ రోడ్డు పొడవునా వస్తుంది. చూడడానికి నగరంలో భాగంగానే ఉన్న ఆ ప్రాంతానికి ఆ జింక ఎలా వచ్చింది..? అసలు ఎక్కడికి వెళ్తోంది అనే వివరాలు తెలియకపోయినా ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు ‘చాలా ముద్దుగా ఉంది. దయచేసి అది కుక్క పిల్ల అని మాత్రం ఎవరు చెప్పకండి. అలా పరుగులు తీస్తున్న జింకను మొదటి సారి చూడడంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ తన సంభ్రమాశ్చర్యాలను తన కామెంట్ ద్వారా తెలియజేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే మరో నెటిజన్ వీడియోపై స్పందిస్తూ ‘ట్రిప్‌కి వెళ్దామని నా భార్యకు చెప్తే.. ఆమె కూడా ఇలాగే పరుగులు తీస్తుంది’ అంటూ సరదాగా రాసుకొచ్చాడు. ‘నిజంగా నమ్మలేకపోతున్నా.. నేను నిద్రలో ఉన్నానేమో అనిపిస్తుంది’ అంటూ మరో నెటిజన్ వీడియోపై తన స్పందనను తెలియజేశాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 31 లక్షలకు పైగా వీక్షణలు, అలాగే 1 లక్షా 83వేల లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..