IPL 2023: ఏంటి గురూ.. ఆ నిప్పులు చెరిగే బంతులు..! అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన మిడిల్ వికెట్లు.. వైరల్ అవుతున్న వీడయో..

IPL 2023, MI vs PBKS: క్రికెట్‌ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి మిడిల్ వికెట్‌కి తాకడమే చాలా కష్టం. అలాంటిది పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన మెరుపు బంతులతో మిడిల్ వికెట్లను రెండు ముక్కలుగా విరగ్గొట్టాడు. అది కూడా వరుసగా రెండు సార్లు. అంతేనా....

IPL 2023: ఏంటి గురూ.. ఆ నిప్పులు చెరిగే బంతులు..! అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన మిడిల్ వికెట్లు.. వైరల్ అవుతున్న వీడయో..
Ipl 2023, Mi Vs Pbks; Arshdeep Breaks Middle Wicket While Tilak Varma Playing
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 23, 2023 | 9:55 AM

IPL 2023, MI vs PBKS: క్రికెట్‌ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి మిడిల్ వికెట్‌కి తాకడమే చాలా కష్టం. అలాంటిది పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన మెరుపు బంతులతో మిడిల్ వికెట్లను రెండు ముక్కలుగా విరగ్గొట్టాడు. అది కూడా వరుసగా రెండు సార్లు. అంతేనా.. చేజారిపోవడానికి ముని వేళ్ల మీద నిలబడిన మ్యాచ్‌లో తన జట్టును గెలిపించాడు. అవును, వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్లో అర్ష్‌దీప్ ధాటికి వికెట్లు కూడా విరిగిపోయాయి. ఇంకా తను వేసిన 4 ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఓటమి అంచుల్లో ఉన్న తన టీమ్‌‌ని విజయ తీరాలకు చేర్చాడు.

అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేశారు. ఈ క్రమంలో పంజాబ్ తరఫున కెప్టెన్ సామ్ కర్రన్(55) అర్థసెంచరీతో రాణించగా.. హర్‌ప్రీత్ సింగ్ సహా మరి కొందరు మెరుగ్గా ఆడారు. దీంతో 215 పరుగుల లక్ష్యంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57) హఫ్ సెంచరీలతో.. అలాగే రోహిత్ శర్మ(44), టిమ్ డేవిడ్ (25 నాటౌట్) మెరుపులు మెరిపించారు. తద్వారా ముంబై టార్గెట్ చివరి ఓవర్‌లో 16 పరుగులకి చేరింది. అయితే ఈ ఓవర్ వేయడానికి అర్ష్‌దీప్‌ని రంగంలోకి దింపాడు పంజాబ్ కెప్టెన్ సామ్‌కర్రన్. అంతే.. అనూహ్యరీతిలో చెలరేగాడు అర్ష్‌దీప్‌. తొలి రెండు బంతులలో 1 పరుగు ఇచ్చి.. మూడో బంతితో మిడిల్ వికెట్‌ విరగ్గొట్టాడు. దీంతో తిలక్ వర్మ(3) పెవిలియన్ బాట పట్టాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వచ్చిన నేహల్ వథేరాను కూడా అదే రీతిలో మిడిల్ వికెట్‌ని ముక్కలు చేయడం ద్వారా డకౌట్ చేశాడు అర్ష్‌దీప్‌. దీంతో అర్ష్‌దీప్ వేయబోయే హ్యాట్రిక్ బంతి ఆడేందుకు క్రీజులోకి వచ్చాడు జోఫ్రా అర్చర్. అయితే అర్చర్ ఆ బంతిని డిఫెండ్ చేయడంతో అర్ష్‌దీప్ హ్యాట్రిక్ వికెట్‌ కోల్పోయాడు. అలా చివరి 2 బంతులలో 1 పరుగలు ఇచ్చి ఓవర్‌ (1 0 W W 0 1)ని విజయవంతంగా ముగించాడు. అలాగే అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహల్ వథేరా వంటి కీలక ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో మ్యాచ్‌ విజయం పంజాబ్ వశమైంది.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..