Watch Video: అవసరం బాబూ..! ‘జింక తోక’ను దొంగిలిస్తున్న కాకి.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..

మనం ఇళ్లు నిర్మించుకున్న మాదిరిగానే కొన్ని రకాల పక్షులు కూడా తమ గూళ్లను అల్లుకుంటాయి. ఇక గూడు అల్లుకోవడం అనేది పక్షులకు మాత్రమే సాధ్యం ఇంకా ఓ మానవాతీతమైన కళ. అయితే అలా గూడు కట్టుకోవడానికి పక్షులు సన్నని పుల్లలు, మెత్తని దూది, లేత గడ్డిపరకలను..

Watch Video: అవసరం బాబూ..! ‘జింక తోక’ను దొంగిలిస్తున్న కాకి.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..
Crow stealing Deer's Fur
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 23, 2023 | 11:34 AM

మనం ఇళ్లు నిర్మించుకున్న మాదిరిగానే కొన్ని రకాల పక్షులు కూడా తమ గూళ్లను అల్లుకుంటాయి. ఇక గూడు అల్లుకోవడం అనేది పక్షులకు మాత్రమే సాధ్యం ఇంకా ఓ మానవాతీతమైన కళ. అయితే అలా గూడు కట్టుకోవడానికి పక్షులు సన్నని పుల్లలు, మెత్తని దూది, లేత గడ్డిపరకలను సేకరిస్తాయి. అలా తన ఇంటికి అవసరమైనవాటిని సేకరిస్తున్న కాకి ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాకి దొంగతనం కూడా చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

అసలు ఆ వీడయోలో ఏం జరిగిందంటే.. చూడడానికి పార్క్‌లా ఉన్న ప్రాంతంలో చెట్టు కింద సేద తీరుతోంది ఓ జింక. అది గమనించిన కాకి.. జింక తోకలోని వెంట్రుకలను తన గూటి కోసం దొంగిలిస్తోంది. చూడడానికి కొన్ని సెకన్ల పాటే ఉన్నా.. గూడు కట్టుకోవడానికి ఆ కాకి పడుతున్న కష్టం నెటిజన్లను కరిగించేస్తోంది. అలాగే వీడియోపై సానుకూలమైన స్పందనతో కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

ఈ క్రమంలోనే వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు ‘కాకి తరఫున ఆ జింకకు థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చారు. అలాగే మరికొందరు ‘అవసరం బాబు.. పిల్లలకు ఇల్లు కట్టాలి’ అంటూ సరదాగా స్పందించారు. ‘గూడు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలానే అన్ని పక్షులు కష్టపడుతుంటాయి. పాపం’ అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశాడు ఓ నెటిజన్. ఇక ఏప్రిల్ 8న lovinganimals.dg అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది. ఈ వీడయోకి ఇప్పటికే దాదాపు 60 వేల లైకులు, 17 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!