Summer Tips: వేసవిలో కూడా చల్లచల్లగా ఉండాలా..? అయితే కూలర్ విషయంలో చేయకూడని తప్పులివే..
Cooler: వేసవి కాలం ఇంకా చొరబడకుండానే ఎండలు మండిపోతున్నాయి. నిప్పుల కొలిమిలా మారిన ఈ వాతావరణంలో ఏసీ లేదా కూలర్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేము. ఇక ఏసీ కొనడం అంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి..
Mistakes with Cooler: వేసవి కాలం ఇంకా చొరబడకుండానే ఎండలు మండిపోతున్నాయి. నిప్పుల కొలిమిలా మారిన ఈ వాతావరణంలో ఏసీ లేదా కూలర్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేము. ఇక ఏసీ కొనడం అంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలా మంది కూలర్‌నే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ కూలర్‌ను సరైన స్థానంలో ఉంచినట్లయితే మాత్రమే, గది వేడెక్కకుండా అంతా చల్లగా మారుతుంది. ఈ విషయం తెలియక చాలా మంది కూలర్‌ని ఎక్కడపడితే అక్కడ పెట్టి వదిలేస్తుంటారు. ఈ క్రమంలో కూలర్‌ను ఎక్కడ ఎలా ఉంచితే మంచిగా గాలి వీస్తుంది.. ఇంకా కూలర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కూలర్‌ను సరైన స్థలంలో ఉంచకపోతే ఉక్కపోతతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. ఆ కారణంగా చల్లని గాలిని అందించడానికి సరైన స్థలంలో ఉంచడం చాలా ముఖ్యం. కూలర్‌ను సరైన స్థలంలో ఉంచడం ద్వారా మీరు గాలిలో చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. ఎయిర్ కండీషనర్ మాదిరిగానే, ఎయిర్ కూలర్‌ను కూడా ప్రత్యేకంగా క్లోజ్డ్ స్పేస్ ఉంచకూడదు.
గదిలోని వేడి గాలి ఎయిర్ కూలర్‌లో నానబెట్టిన శీతలీకరణ ప్యాడ్ గుండా వెళుతుంది. అది అక్కడ బాష్పీభవనం చెందిన తర్వాత చల్లని గాలిని ఇస్తుంది. అందువల్ల ఇంట్లో ఎయిర్ కూలర్‌ను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం కిటికీ. గాలి ఎంత వేడిగా ఉంటే అంత వేగంగా బాష్పీభవనం చెంది గాలి చల్లగా ఉంటుంది. అలాగే గది నుంచి తేమను తొలగించడానికి మంచి వెంటిలేషన్ సృష్టించడానికి గది కిటికీని కొద్దిగా తెరవండి.
ఇంకా మీరు కూలర్‌ని వాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. కిటికీలను పూర్తిగా తెరవవద్దు. అది గది ఉష్ణోగ్రతను బాగా పెంచుతుంది. గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా మాత్రమే దాన్ని తెరిచి ఉంచండి. అలాగే లేదా కూలింగ్ ప్యాడ్ మురికిగా ఉండకుండా చూసుకోండి. అది శుభ్రంగా ఉంటేనే గాలి ప్రవాహాన్ని ప్రభావితం చేసి గదిని చల్లబరిచే విధంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..