AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి సన్నిధిలో స్కామ్..! ఎమ్‌ఎల్‌సీపై కేసు నమోదు చేసిన పోలీసులు..

Tirumala: తిరుమలలో ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ స్కామ్ వ్యవహారం తీవ్ర దూమారంగా మారింది.  రేపుతోంది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీతో పాటు మరో ఇద్దరిపై తిరుమల టూ టౌన్

Tirumala: శ్రీవారి సన్నిధిలో స్కామ్..! ఎమ్‌ఎల్‌సీపై కేసు నమోదు చేసిన పోలీసులు..
Mlc Shaik Sabji In Ttd Tickets Scam
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 22, 2023 | 8:54 AM

Share

Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. శ్రీవారి టిక్కెట్లు విక్రయం విషయంలో తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ఆయన సహచరులను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో ఏ1గా ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్, ఏ2గా డేగ రాజు, ఏ3గా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై ఐపీసీ సెక్షన్ 420 ,468, 472, రెడ్ విత్ 34 ప్రకారం తిరుపతి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీకి నోటీసులిచ్చి వదిలేయగా.. డేగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పీఏ వేణుగోపాల్‌ కోసం గాలిస్తున్నారు.

300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటగిరీ కింద ఆరుగురు భక్తులకు దర్శనం కల్పించేందుకు ఎమ్మెల్సీ రూ.లక్ష వసూలు చేశారని, శ్రీవారి దర్శనం టిక్కెట్లను అక్రమంగా పొందేందుకు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించారని టీటీడీ విజిలెన్స్ విభాగం తెలిపింది. 14 మందికి ప్రోటోకాల్ కేటగిరీ కింద వీఐపీ బ్రేక్ దర్శనం మంజూరుకు సంబంధించి జేఈవో కార్యాలయానికి ఎమ్మెల్సీ ముందస్తు సమాచారం పంపారని తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు చేసింది. ఇక తిరుమల ఆలయంలో దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు ఒక ప్రజా ప్రతినిధి పాల్పడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.

అంతకముందు షేక్ సబ్జీ ఇతర భక్తులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున దర్శనానికి వచ్చినప్పుడు, భక్తులు సమర్పించిన ఆధార్ కార్డులు నకిలీవని విజిలెన్స్ వింగ్ గుర్తించింది. దర్శన టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సమర్పించిన భక్తుల ఆధార్ కార్డులలోని చిరునామా హైదరాబాద్ కాగా, వారు వాస్తవానికి కర్ణాటకకు చెందినవారని తేలింది. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌ వారిని నిలదీయగా, రూ.500 ధర ఉన్న వీఐపీ దర్శనం టిక్కెట్ల కోసం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి రూ.లక్ష  చెల్లించినట్లు తెలిసింది.  ఇలా దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ ద్వారా భక్తుల నుంచి వచ్చిన అక్రమ సొమ్ము అంతా ఎమ్మెల్సీ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని విచారణలో తేలింది.

ఇవి కూడా చదవండి

కాగా, గత నెల రోజుల్లోనే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తిరుమల ఆలయంలో దర్శన టిక్కెట్ల కోసం 19 సిఫార్సు లేఖలు జారీ చేశారు. ఈ టిక్కెట్లలో ఎక్కువ భాగం అధిక ధరలకు అమ్ముడుపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఒక్కో వీవీఐపీకి గరిష్ఠంగా 10 వీఐపీ దర్శన పాస్‌లు మాత్రమే జారీ చేయవచ్చని జేఈవో కార్యాలయం స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం