AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ‘సన్‌రైజర్స్‌పై అతడే మా బహుబలి’.. మ్యాచ్‌కి ముందు చెన్నై టీమ్ సంచలన ట్వీట్.. అసలు ఆ ఆటగాడు ఎవరంటే..

CSK vs SRH: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ ఓ సంచలన ట్వీట్ చేసింది. చెన్నై టీమ్‌లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్లేయర్‌ని తన ట్వీట్‌లో ‘బహుబలి vs SRH’ అంటూ తన..

IPL 2023: ‘సన్‌రైజర్స్‌పై అతడే మా బహుబలి’.. మ్యాచ్‌కి ముందు చెన్నై టీమ్ సంచలన ట్వీట్.. అసలు ఆ ఆటగాడు ఎవరంటే..
ఐపీఎల్ వేలం 2018లో చెన్నై సూపర్ కింగ్స్ అంబటి రాయుడిని దక్కించుకుంది. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటం కొనసాగించాడు. అంబటి రాయుడు ఐపీఎల్‌లో సెంచరీతో పాటు 22 సార్లు యాభై పరుగుల మార్క్‌ను దాటాడు.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 21, 2023 | 5:26 PM

Share

CSK vs SRH: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ ఓ సంచలన ట్వీట్ చేసింది. చెన్నై టీమ్‌లోని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్లేయర్‌ని తన ట్వీట్‌లో ‘బహుబలి vs SRH’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొంది. అసలు ఆ తెలుగు ఆటగాడు ఎవరంటే..  సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై అద్భుత రికార్డులు కలిగిన అంబటి రాయుడు. అవును, హైదరాబాద్ టీమ్‌పై రాయుడికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఎందుకో తెలీదు కానీ ఆరెంజ్ ఆర్మీపై ఆడినప్పుడల్లా రాయుడు పరుగుల వరద పారిస్తుంటాడు. ఈ విషయాన్ని అతని రికార్డులే చెబుతున్నాయి.

ఇప్పటివరకు అంటే ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 20 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. కేవలం 17 ఇన్నింగ్సుల్లోనే బ్యాటింగ్‌ చేసినా.. 45 సగటు, 130.12 స్ట్రైక్‌రేట్‌, 540 పరుగులు.. ఇదీ ఆరెంజ్ ఆర్మీపై అంబటి రాయుడి ట్రాక్ రికార్డు. అంతేనా..  ఈ 17 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు నాటౌట్‌గా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అంబటి రాయుడే తన తరఫున నిలబడే ‘బాహుబలి’ అని పేర్కొంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.

ఇవి కూడా చదవండి

కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచులలో 3 గెలిచింది. ఇంకా పాయింట్ల పట్టికలో 6 పాయింట్లు, 0.265 రన్‌రేట్‌తో 3వ స్థానంలో ఉంది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడింది. అయితే ఆరెంజ్ ఆర్మీ వాటిలో 2 మ్యాచ్‌లను మాత్రమే గెలుచుకుంది. తద్వారా 4 పాయింట్లు, 0.798రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..