AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Friendship: ఎంతో అరుదైన దృశ్యం.. కోడి పిల్లలతో కుక్క స్నేహం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

Dog and Chicks Friendship: సాధారణంగా కుక్కను చూస్తే ఏ కోడి అయినా.. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగుతీస్తుంది. అలాగే కుక్కలు కూడా కోడి కనిపించగానే నోట బెట్టుకుని తినేయాలని ప్రయత్నిస్తుంటాయి. వాటి మధ్య శత్రుత్వం ఉందో లేదో కానీ  స్నేహం ఉంటుందని మాత్రం అందరికీ తెలుసు. వాటి మధ్య

Unique Friendship: ఎంతో అరుదైన దృశ్యం.. కోడి పిల్లలతో కుక్క స్నేహం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
Chicks Friendship With Dog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 21, 2023 | 4:20 PM

Share

సాధారణంగా కుక్కను చూస్తే ఏ కోడి అయినా.. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగుతీస్తుంది. అలాగే కుక్కలు కూడా కోడి కనిపించగానే నోట బెట్టుకుని తినేయాలని ప్రయత్నిస్తుంటాయి. వాటి మధ్య శత్రుత్వం ఉందో లేదో కానీ  స్నేహం ఉంటుందని మాత్రం అందరికీ తెలుసు. వాటి మధ్య స్నేహం కుదురుతుందని కలలో కూడా ఎవరూ ఊహించరు. కానీ కుదిరింది. ఒక వీధి కుక్క కోడి పిల్ల సమూహంతోనే స్నేహం చేస్తుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే వీడియోను చూసిన నెటిజన్లు ‘నిజమైన స్నేహం’ అంటూ ఆ మూగ జీవాలను ప్రశంసిస్తున్నారు.

అసలు ఆ కుక్కకు కోడి పిల్లలతో స్నేహం ఎలా కుదిరిందంటే.. తన తల్లితో తిరుగుతున్న ఓ కోడి పిల్లతో స్నేహం చేసేందుకు ప్రయత్నించింది వీధి కుక్క. అయితే కోడిని నోట బెట్టుకుని పోయే కుక్కలను నమ్మకూడదనుకున్న ఆ తల్లి తన పిల్లల వద్దకు దాన్ని రానివ్వలేదు. ‘నా పిల్లల వద్దకు రాకు’ అంటూ ఆ కుక్కను పొడిచే ప్రయత్నం కూడా చేసింది ఆ తల్లి కోడి. అయితే ఎలా సాధ్యమయిందో ఆ కుక్క తను అనుకున్న పని చేసి, కోడి పిల్లతో స్నేహం ప్రారంభించింది. తమ తోబుట్టువులో స్నేహం చేస్తున్న కుక్క, తమను ఏం చేయదని గ్రహించిన మిగిలిన కోడిపిల్లలు కూడా దానితో స్నేహం చేయడం మొదలెట్టాయి. అలా సాగిన ఈ దృశ్యాలను వీడియో తీసిన వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక ‘కుక్క-కోడిపిల్లల స్నేహం’ వీడియోని చూసిన నెటిజన్లు కుక్క సాధుస్వభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు నెటిజన్లు వాటి స్నేహం కలకాలం అలాగే నిలిచిపోవాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా స్నేహానికి కులజాతిమత వైరుధ్యాలు లేవనడానికి ఇదే ఉదాహరణ అంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షా 15 వేల లైకులు, 14 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. ఇంకా పలువురు ఈ వీడియోను తమ స్నేహితులకు షేర్ కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..