Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్ ప్రాణాంతకం.. వ్యాధి విషయంలో వదిలేయాల్సిన అపోహలివే.. అసలు వాస్తవాలు ఏమిటంటే..?
Kidney Cancer: ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్‌గా కిడ్నీ క్యాన్సర్ మారుతోంది. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి ఏటా దాదాపుగా 1.5 లక్షల కంటే ఎక్కుల మందే మరణిస్తున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనా ప్రకారం అమెరికాలో మాత్రమే ఈ సంవత్సరం..
Kidney Cancer: ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్‌గా కిడ్నీ క్యాన్సర్ మారుతోంది. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి ఏటా దాదాపుగా 1.5 లక్షల కంటే ఎక్కుల మందే మరణిస్తున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనా ప్రకారం అమెరికాలో మాత్రమే ఈ సంవత్సరం 81,800 కంటే ఎక్కువ కిడ్నీ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కిడ్నీ క్యాన్సర్ ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఇంకా ఇది మహిళల కంటే పురుషులనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
అయితే కిడ్నీ క్యాన్సర్‌ని సరైన సమయంలో గుర్తించకపోవడం వల్లనే ఎక్కువ మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం కూడా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడానికి గల మరో కారణంగా వారు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ క్యాన్సర్ గురించి ప్రచారంలో ఉన్న అపోహలు, వాటి వెనుక ఉన్న అసలైన వాస్తవాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీ క్యాన్సర్‌కు సంబంధించిన అపోహలు, వాటి వాస్తవాలు..
1. అపోహ: మూత్రంలో రక్తం కనిపిస్తే.. అదే మూత్రపిండ క్యాన్సర్‌కు సంకేతం.
వాస్తవం: మూత్రంలో రక్తం కనిపించడం కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతమే. కానీ కిడ్నీ క్యాన్సర్ వల్ల మాత్రమే మూత్రంలో రక్తం వస్తుందనేది అవాస్తవం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి ఇతర మూత్ర సమస్యల కారణంగా కూడా మూత్రంతో పాటు రక్తం పడుతుంది.
2. అపోహ: కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదు.
వాస్తవం: ఆరోగ్య నిపుణుల ప్రకారం, నేటి కాలంలో ఏ క్యాన్సర్ కూడా అరుదు కానే కాదు. ఇంకా ఇతర క్యాన్సర్‌ల మాదిరిగానే కిడ్నీ క్యాన్సర్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధితులుగా మారుస్తోంది. అంతేకాక వేలాది మంది ప్రాణాపాయానికి కూడా కారణమవుతోంది.
3. అపోహ: ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ రాదు.
వాస్తవం: కిడ్నీ క్యాన్సర్‌కు అతి పెద్ద ప్రమాద కారకం ధూమపానమేనని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ధూమపానం కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.
4. అపోహ: కిడ్నీ క్యాన్సర్ వంశపారంపర్యం కాదు.
వాస్తవం: చాలా మంది తమ కుటుంబంలో ఎవరికీ కిడ్నీ క్యాన్సర్ లేకపోతే వారికి ఆ ప్రమాదం లేదని అనుకుంటారు. అయితే కిడ్నీ క్యాన్సర్ కేసుల్లో 2 నుంచి 3 శాతం మాత్రమే వంశపారంపర్యంగా వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
5. అపోహ: కిడ్నీ క్యాన్సర్ సర్జరీ కారణంగా కిడ్నీ దెబ్బతింటుంది.
వాస్తవం: ఏదైనా క్యాన్సర్‌ని సకాలంలో గుర్తిస్తే విజయవంతంగా చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. చాలా శస్త్ర చికిత్సలు మొత్తం అవయవాన్ని కాకుండా కణితిని తొలగించడంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కిడ్నీ క్యాన్సర్ సర్జరీ కారణంగా కిడ్నీ దెబ్బతింటుందనే అపోహలో వాస్తవం లేదు.
6. అపోహ: కిడ్నీ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే కనిపిస్తుంది.
వాస్తవం: అనేక అధ్యయనాల ప్రకారం, కిడ్నీ క్యాన్సర్ స్త్రీలలో కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కిడ్నీ క్యాన్సర్ పురుషులకు రాదని అనుకోవడం తప్పు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.