Clove Benefits: రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక్క లవంగం తింటే ఆ సమస్యలే దరిచేరవు.. అవేంటంటే..?

వంటింట్లో ఉండే మసాలా దినులు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో లవంగం ఒకటి. లవంగం శరీరానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. అయితే, లవంగాలను రాత్రిపూట తింటే చాలామంచిదని.. చాలా ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Clove Benefits: రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక్క లవంగం తింటే ఆ సమస్యలే దరిచేరవు.. అవేంటంటే..?
Clove Benefits
Follow us

|

Updated on: Apr 21, 2023 | 1:36 PM

వంటింట్లో ఉండే మసాలా దినులు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో లవంగం ఒకటి. లవంగం శరీరానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. అయితే, లవంగాలను రాత్రిపూట తింటే చాలామంచిదని.. చాలా ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు రోజూ రాత్రిపూట లవంగాలను తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుంది. అటువంటి పరిస్థితిలో, లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

వాపు తగ్గుతుంది: లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా శరీరంలో వాపు లేదా నొప్పి ఉంటే లవంగాలను తినవచ్చు. పంటి నొప్పి లేదా శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉన్నవారు రాత్రిపూట లవంగాలను తినవచ్చు.

ఆకలి అనిపించదు: కొందరికి రాత్రిపూట తినాలనే కోరిక కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు లవంగాలతో ఈ కోరికను తొలగించవచ్చు. అందుకే లవంగాలను పాలలో కలుపుకుని తాగవచ్చు. లేదా లవంగాలను నేరుగా తినవచ్చు. దీంతో రాత్రిపూట ఆహారంపై కోరిక ఉండదు.

ఇవి కూడా చదవండి

దగ్గు – జలుబు: గోరువెచ్చని నీటిలో లవంగం తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు సమస్య నయమవుతుంది. అదే సమయంలో, లవంగం, తేనె మిశ్రమం యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మిశ్రమం మీ శరీరానికి మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:  రాత్రివేళ నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో రెండు లవంగాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

లవంగాలను ఈ విధంగా తినండి..

  • కూరగాయలు, రోటీ, సలాడ్‌లో లవంగాల పొడిని కలిపి తినవచ్చు.
  • లవంగాల పొడిని పాలలో కలిపి తినవచ్చు.
  • లవంగాలను గోరువెచ్చని నీటిని కలిపి తీసుకోవచ్చు.

అయితే, లవంగాలు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కావున లవంగాలను మితంగా తినాలి. రోజూ రెండు కంటే ఎక్కువ తినకపోవడం మంచిది. ఇంకా ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.