IPL 2023: సిక్సర్లతో ధోని మరోసారి అలరించేనా..? సూపర్ కింగ్స్‌తో తలపడబోతున్న సన్‌రైజర్స్.. తుది జట్ల వివరాలివే..
IPL 2023, CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. 16వ సీజన్‌లో..
IPL 2023, CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. 16వ సీజన్‌లో ఇరు జట్ల ప్రచారాన్ని గమనిస్తే.. చెన్నై ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 ఆటలే ఓడింది. మరోవైపు హైదరాబాద్ టీమ్ తన 5 మ్యాచ్‌ల్లో రెండే గెలిచింది. ఇక ఈ రోజు మ్యాచ్‌లో ధోని తన సిక్సర్లతో మరోసారి అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పైగా ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగడంతో ధోని ప్రభావం మ్యాచ్‌పై ఎక్కువ ఉండనుంది. మరోవైపు సీఎస్‌కే బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. టీమ్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతంగా రాణిస్తున్నారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చే రహానే, ఆపై క్రీజులోకి ఆడుగుపెట్టే శివమ్ దుబే కూడా ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారు. అంబటి రాయుడు, మొయిన్ అలీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినా.. జడేజా, కెప్టెన్ ధోనీ ఫినిషింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహేశ్ తీక్షణ , తుషార్ దేశ్ పాండే, మతీషా పతిరానా చెన్నై టీమ్‌కి బౌలింగ్ అందిస్తున్నారు. అలాగే జేడేజా, మోయిన్ ఆలీ కూడా బౌలింగ్ చేస్తున్నారు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ గురించి చెప్పుకోవాలంటే హ్యారీ బ్రూక్ చేసిన సెంచరీతో అతను గాడిలో పడ్డాడని అంతా భావించారు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చిందని ఈ నెల 18న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. మయాంక్ అగర్వాల్ ఫామ్‌కి వచ్చినందున టీమ్‌కి అతను బలమైన బ్యాట్స్‌మ్యాన్. అలాగే రాహుల్ త్రిపాఠి, ఆడమ్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ కూడా రాణిస్తే చెన్నైటీమ్‌కి కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో హైదరాబాద్ తరఫున భువనేశ్వర్ కుమార్ మినహా మిగిలినవారు పెద్దగా రాణించడంలేదు. మరి ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ ఎలా రాణిస్తారో వేచి చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ , డెవాన్ కాన్వే , అజింక్యా రహానే, శివమ్ దుబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ , తుషార్ దేశ్ పాండే , మతీషా పతిరానా.
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఆడమ్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..