Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌లో రన్‌మెషిన్‌ రికార్డుల పర్వం.. ఆ విషయంలో సెంచరీ కొట్టేసిన విరాట్ కోహ్లీ

గత కొన్ని నెలలుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు ఛేజ్ మాస్టార్ విరాట్‌ కోహ్లీ. తాజాగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 16వ సీజ‌న్‌లో దంచి కొడుతున్నాడు. ఐపీఎల్ మరో రెండు రికార్డులు సృష్టించాడు. మొహాలి వేదికగా జరిగిన పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో '30 ప్లస్‌' స్కోరు వందసార్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు.

Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌లో రన్‌మెషిన్‌ రికార్డుల పర్వం.. ఆ విషయంలో సెంచరీ కొట్టేసిన విరాట్ కోహ్లీ
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2023 | 9:51 AM

గత కొన్ని నెలలుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు ఛేజ్ మాస్టార్ విరాట్‌ కోహ్లీ. తాజాగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 16వ సీజ‌న్‌లో దంచి కొడుతున్నాడు. ఐపీఎల్ మరో రెండు రికార్డులు సృష్టించాడు. మొహాలి వేదికగా జరిగిన పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ’30 ప్లస్‌’ స్కోరు వందసార్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశారు. ఆరంభం నుంచి డుప్లెసిస్‌కు స్ట్రైక్‌ ఇస్తూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. ఏడో ఓవర్లో రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో మూడో బంతికి రెండు పరుగులు చేసి 30 పరుగులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 30 ప్లస్ స్కోర్ వందో సారి నమోదు చేసిన ఫస్ట్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఇక కోహ్లీ తర్వాత శిఖర్‌ ధావన్‌ ఇప్పటివరకు 91 సార్లు 30 ప్లస్‌ రన్స్‌ చేశాడు. అలాగే వార్నర్ ( 90 సార్లు), రోహిత్ శర్మ( 85 సార్లు), మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా(77 సార్లు) 30 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు.

ఆ రికార్డులు కూడా దాసోహం..

కాగా పంజాబ్ తో మ్యాచ్ లో 59 పరుగులు చేశాడు  విరాట్ కోహ్లీ. అంతేకాకుండా పంజాబ్ పై 5 పోర్లు కొట్టిన కోహ్లీ.. 600 ఫోర్లు బాదిన మూడో క్రికెట‌ర్‌గా గుర్తింపు సాధించాడు కోహ్లీ. దీంతో ఆరొంద‌ల ఫోర్లు క్ల‌బ్‌లో చేరాడు. 229 మ్యాచుల్లో 603 బౌండ‌రీలు సాధించి ఈ ఫిట్ ను అందుకున్నాడు. ఇక ఐపీఎల్ లో 730 ఫోర్లు కొట్టి.. అత్యధిక ఫోర్లు కొట్టి బ్యాటర్ గా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌ శిఖ‌ర్ ధావ‌న్ అగ్రస్థానంలో ఉన్నాడు. గ‌బ్బర్ 210 మ్యాచుల్లో ఈ ఫీట్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 608 ఫోర్లతో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..