- Telugu News Photo Gallery Cricket photos PBKS vs RCB: Virat Kohli becomes 3rd Player to Complete 600 Fours in IPL History, Check full list of players
PBKS vs RCB: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా..
మొహాలి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్ కింగ్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 6 వందలు లేదా అంత కంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Updated on: Apr 20, 2023 | 6:47 PM

పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 59 పరుగులు చేసిన కోహ్లీ 5 ఫోర్లు, 1 సిక్సర్ కూడా బాదాడు. అంతేకాక ఐపీఎల్‌లో 600 ఫోర్లు కూడా పూర్తి చేసుకున్నాడు.

విశేషమేమంటే.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ కంటే ముందు ఇద్దరు మాత్రమే 600 ఫోర్లు బాదారు. మరి ఐపీఎల్ క్రికెట్‌లో 6 వందలు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు బాదిన ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ క్రికెట్‌లో 6 వందలు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 209 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్ ఏకంగా 730 ఫోర్లు కొట్టాడు. అలా ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మ్యాన్‌గా ఎవరికీ అందనంత దూరంలో ధావన్ ఉన్నాడు.

ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 167 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 608 ఫోర్లు కొట్టిన వార్నర్ మామ ఈ లిస్టులో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక తాజాగా, ఏప్రిల్ 20న పంజాబ్‌పై 5 ఫోర్లు బాదిన కోహ్లీ కూడా ఈ లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు. 221 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 603 ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

మరోవైపు కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (535 ఫోర్లు), సురేష్ రైనా(506) మాత్రమే 500 ఫోర్లు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు పూర్తి చేసుకున్నారు.




