AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాయ్‌ఫ్రెండ్‌ లేడని ఫీల్ అవుతున్నారా? రూ.1000 ఉంటే ఆ బాధ తీరినట్టే

జపాన్ వంటి దేశాల్లో పాపులర్ అయిన 'రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్' కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశంలోకి కూడా ప్రవేశించింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇషా భల్లా, 'కో-పార్ట్‌నర్' అనే వెబ్ సైట్ ద్వారా బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకున్నానని సోషల్ మీడియాలో పేర్కొనడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షాపింగ్‌కు వెళ్లడం, బ్యాగులు మోయడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం వంటి పనుల కోసం అద్దె భాగస్వామిని బుక్ చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.

బాయ్‌ఫ్రెండ్‌ లేడని ఫీల్ అవుతున్నారా? రూ.1000 ఉంటే ఆ బాధ తీరినట్టే
Rent A Boy Friend
Nikhil
|

Updated on: Jun 10, 2026 | 10:18 PM

Share

జపాన్ వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ కాన్సెప్ట్ ఇప్పుడు మన దేశంలోనూ అడుగుపెట్టింది. అద్దెకు బాయ్‌ఫ్రెండ్ దొరుకుతారా? అవును, కో-పార్ట్‌నర్ అనే వెబ్ సైట్ ద్వారా మీరు కావాల్సిన పనుల కోసం భాగస్వామిని బుక్ చేసుకోవచ్చు! ఇన్‌ఫ్లుయెన్సర్ ఇషా భల్లా కో-పార్ట్‌నర్ అనే వెబ్‌సైట్ ద్వారా బాయ్‌ఫ్రెండ్‌ను బుక్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇషా భల్లా ప్రమోట్ చేసిన ఈ సర్వీస్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. డబ్బులు చెల్లిస్తే అద్దెకు దొరికే ఈ భాగస్వాములతో ఉన్న లాభాలేంటి? ఈ సేవల వెనుక ఉన్న అసలు కథేంటి, వీటితో ఉన్న ప్రయోజనాలేంటి?

ఈ సేవలు ఎలా పనిచేస్తాయి?

కో-పార్ట్‌నర్ వెబ్ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత, మన అవసరాలకు తగ్గట్టుగా భాగస్వామిని ఎంచుకోవచ్చు. స్నేహితులతో గడపడం, క్లబ్బింగ్‌కు వెళ్లడం, సినిమాలకు తోడుగా ఉండటం, ట్రావెలింగ్ లేదా ఇంట్లో పనుల్లో సహాయం కోసం కూడా వీరిని బుక్ చేసుకోవచ్చు. సర్వీస్‌ను బట్టి వీరికి గంటకు రూ.1000 నుండి రూ.1500 వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఇషా భల్లా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇదొక ప్రమోషనల్ వీడియో అని ఆమె స్పష్టం చేశారు.

భయాందోళనలు

ఈ ట్రెండ్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలో అపరిచితులతో స్నేహం చేయడం, షాపింగ్ లేదా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రావా? అని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దెకు వచ్చిన వారు తీసుకున్న ఫోటోలతో లేదా సన్నిహితంగా ఉన్న సమయాలను ఆసరాగా చేసుకుని భవిష్యత్తులో బ్లాక్ మెయిల్ చేస్తే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అబ్బాయిలు చాలామంది ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉన్నప్పుడు, ఇలా డబ్బులు పెట్టి అద్దెకు తీసుకోవడం అవసరమా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇండియా వంటి దేశంలో ఇటువంటి కాన్సెప్ట్‌లు కొత్తవి కావడంతో వీటిపై భద్రతాపరమైన సందేహాలు కలగడం సహజం. వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్న సేవలు ఒక ప్రమోషనల్ స్టంట్ కావచ్చు లేదా పెరుగుతున్న డిమాండ్ వల్ల పుట్టుకొచ్చిన సర్వీస్ కావచ్చు, కానీ వీటిని వినియోగించుకునే ముందు వ్యక్తిగత భద్రత మరియు డేటా ప్రైవసీపై అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. కొత్త తరం డిజిటల్ యుగంలో ఇలాంటి వింతైన ట్రెండ్స్ ఎంతవరకు ఆదరణ పొందుతాయో కాలమే నిర్ణయించాలి!

Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!