AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

ఐటీ శాఖ నగదు లావాదేవీల విషయంలో కఠిన రూల్స్ అమలు చేస్తోంది. చేబదులుగా, అప్పుగా ఇచ్చే క్యాష్ విషయంలో అనేక రూల్స్ అమల్లో ఉన్నాయి. ఆ పరిమితి దాటి మీరు చేబదులుగా ఇస్తే ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది.

IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..
Indian Money
Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 9:57 PM

Share

నగదు లావాదేవీల విషయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పారదర్శకంగా నగదు బదిలీలు జరిగేలా అనేక రూల్స్ అమలు చేస్తోంది. నగదుపై నియంత్రణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అనేక నియమాలు, పరిమితులు విధించింది. వీటిని దేశంలోని ప్రతీఒక్కరూ పాటించాల్సిందే. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా అనేది ఉంటుంది. మీకు ఏదైనా అత్యవసరం అయినప్పుడు స్నేహితులు, బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా చేబదులుగా వీటిని తీసుకుంటారు. వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఇలాంటి పెద్ద లావాదేవీలు కూడా ఐటీ ఉల్లంఘన కిందకే వస్తాయి.

చేబదులుగా ఇస్తున్నారా..?

చేబదులుగా తీసుకునే నగదు విషయంలో ఐటీ శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఏదైనా వ్యక్తి నుంచి క్యాష్ రూపంలో రూ.20 వేల కంటే ఎక్కవ తీసుకోకూడదని ఐటీ నిబంధనలు చెబుతున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్ ప్రకారం ఎవరైనా సరే రూ.20 వేల కంటే ఎక్కువ నగదు రూపంలో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మీరు ఐటీ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని రూల్స్ చెబుతున్నాయి. ఐటీ శాఖ గుర్తిస్తే అప్పు ఇచ్చినవారితో పాటు తీసుకున్నవారికి కూడా జరిమానా విధిస్తుంది. డబ్బులు ఇచ్చినవారికి ఆ సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనే వివరాలను ఐటీ శాఖ సేకరిస్తుంది. సరైనా ఆధారాలు చూపించకపోతే చర్యలు తీసుకుంటారు. మీకు ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రూ.20 వేలపైబడి లావాదేవీలను ఆన్ లైన్, చెక్ ,డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయండి.

వీటికి మాత్రమే వర్తింపు

సెక్షన్ 269ఎస్ఎస్ కేవలం అప్పులు, డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే సెక్షన్ 267ఎస్టీ ప్రకారం బంగారం కొనుగోలు, ఆస్తి అమ్మకం, ఇతర వ్యాపార లావాదేవీలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు క్యాష్ రూపంలో ఇవ్వకూడదు. ఐటీ శాఖ గురిస్తే భారీగా జరిమానా విధిస్తుంది. బిజినెస్ ఆడిట్ జరిగే సమయంలో యాన్యువల్ ఇన్పర్మేషన్ స్టేట్ మెంట్ సమయంలో మిమ్మల్ని ఐటీ శాఖ గుర్తించవచ్చు. దీంతో రూ.20 వేల కంటే ఎక్కువగా తీసుకుంటుంటే డిజిటల్ విధానంలో తీసుకోవడం బెటర్. లేకపోతే ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు 100 శాతం పెనాల్టీ విధిస్తుంది. ఈ మేరకు ఐటీ చట్టంలో నిబంధనలు పొందుపర్చింది. చాలామందికి కొత్త రూల్స్ గురించి తెలియక ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో నగదు ఇస్తూ ఉంటారు. అలా చేయవద్దని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

Follow Us