IPL 2023: ‘హైదరాబాదీ’ ధాటికి పేకమేడలా కూలిన పంజాబ్ టీమ్.. ఆర్‌సీబీ ఖాతాలో మూడో విజయం..

IPL 2023, PBKS vs RCB: మొహాలీలో ఆర్‌సీబీ టీమ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆర్‌సీబీ బ్యాటర్లు ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 150 పరుగులకే..

IPL 2023: ‘హైదరాబాదీ’ ధాటికి పేకమేడలా కూలిన పంజాబ్ టీమ్.. ఆర్‌సీబీ ఖాతాలో మూడో విజయం..
Rcb Vs Pbks Ipl 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 20, 2023 | 7:58 PM

IPL 2023, PBKS vs RCB: మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టీమ్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఆర్‌సీబీ బ్యాటర్లు ఇచ్చిన 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 150 పరుగులకే కుప్పకూలారు. దీంతో పంజాబ్ కింగ్స్‌పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బెంగళూరు ఆటగాళ్లైన ఫాఫ్ డూ ప్లెసీస్(84), విరాట్ కోహ్లీ(59) పరుగులతో ఈ మ్యాచ్‌లోనే టాప్ స్కోరర్లుగా నిలిచారు. సామ్ కర్రన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తొలుత టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్‌సీబీ తరఫున బ్యాటింగ్‌కి వచ్చిన ఫాఫ్ డూ ప్లెసీస్, విరాట్ కోహ్లీ అర్థ శతకాలతో చెరరేగడమే కాక తొలి వికెట్‌కి 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

అయితే హర్‌ప్రీత్‌బ్రార్ వేసిన విరాట్ కోహ్లీ, అనంతరం వచ్చిన మాక్స్‌వెల్(0) వెనుదిరిగారు. ఆ క్రమంలో దినేశ్ కార్తీక్ (7), లూమర్ (7 నాటౌట్), షబాజ్ అహ్మద్ (5 నాటౌట్) తమ వంతుగా మరికొన్ని పరుగులు సాధించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్‌బ్రార్ 2, అర్షదీప్ సింగ్ 1, నాథన్ ఎల్లిస్ 1 వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ వరుస వికట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్(46), జితేష్ శర్మ(41) మాత్రమే రాణించారు.  మిగిలినవారిలో చాలా మంది రెండంకెల స్కోర్ దాటేవరకు కూడా క్రీజులో నిలవలేకపోయారు. దీంతో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులు వద్ద ఆలౌట్ అయింది. మరోవైపు బెంగళూరు తరఫున మహమ్మద్ సిరాజ్ 4 వికట్లతో చెలరేగాడు. అలాగే హసరంగా 2.. వెయినే పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డీఎస్సీ వయోపరిమితి పెంపుపై విద్యాశాఖ కసరత్తులు.. మంత్రి లోకేశ్‌

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో అద్భుత నిర్మాణం.. ఎత్తైన శివ మందిరం

నంగనాశిలా నాటకాలు వేసి.. పాపం ఆ అమ్మాయిని అబాసుపాలు చేసి..

ఇక వరదలను ముందుగానే గుర్తించొచ్చు.. గూగుల్ AI సరికొత్త ఇన్వెన్షన్

ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !

యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న నయనతార.! మరింత గ్లామరస్ గా..

రోగిని పొదల్లో పడేసిన అంబులెన్స్ సిబ్బంది.. రోగి మృతి

క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీఇదే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు

ఎన్టీఆర్ పై అభిమానం.. ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా.. ?

తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్..
తెలంగాణ నుంచి శబరిమలకు అదనంగా మరో 9 స్పెషల్ ట్రైన్స్..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?

లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో

భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..

సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?

పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..

తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!

హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్

రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు