- Telugu News Photo Gallery Cricket photos PBKS vs RCB: Virat Kohli completes his ‘unique hundred’ in IPL, Here are the Players who are next in line to achieve it
PBKS vs RCB: కోహ్లీ కొట్టింది 59 పరుగులే, కానీ ఐపీఎల్‌లో ‘అరుదైన శతకం’.. సమీపంలో ఎవరెవరు ఉన్నారంటే..?
IPL 2023, PBKS vs RCB: మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన శతకాన్ని అందుకున్నాడు. విశేషమేమంటే.. ఐపీఎల్ చరిత్రలో అలాంటి సెంచరీని మరే ఆటగాడు అందుకోలేదు. అసలు ఆ సెంచరీ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 20, 2023 | 9:07 PM

పంజాబ్ కింగ్స్‌పై 59 పరుగులతో 48వ ఐపీఎల్ అర్థ శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఇవే పరుగులతో మరో అరుదైన శతకాన్ని కూడా అందుకున్నాడు. అవును, ఐపీఎల్ చరిత్రలో కింగ్ కోహ్లీ మాత్రమే 30+ పరుగులను 100 సార్లు చేశాడు. ఇక వీటిలో 47 ముప్ఫై ప్లస్ స్కోర్లు, 48 అర్థ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి.

ఇక కోహ్లీ తర్వాత ఈ రకమైన ఘనతను అందుకోవడానికి పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ అత్యంత సమీపంలో ఉన్నాడు. గబ్బర్ ఇప్పటివరకు 91 సార్లు 30+ పరుగులు చేశాడు.

అలాగే ఈ వరుసలో ఢిల్లీ క్యాపిటల్స్ నాయకుడు డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. వార్నర్ మామ తన ఐపీఎల్ కెరీర్‌లో 90 సార్లు 30+ పరుగుల మార్క్ అందుకున్నాడు.

ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ కూడా 85 సార్లు 30+ పరుగులు చేశాడు.

‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా కూడా కింగ్ కోహ్లీ శతకానికి సమీపంలో ఉన్నాడు. ఇప్పటివరకు 77 సార్లు 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల మార్క్ అందుకున్నాడు. అయితే సురేష్ రైనాను ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఎవరూ కొనుగోలు చేయలేదు.




