IPL 2023, PBKS vs RCB: సామ్ కర్రన్‌ని కొట్టబోయిన కింగ్ కోహ్లీ.. కారణం తెలియాలంటే వీడియోను చూసేయాల్సిందే..
IPL 2023, PBKS vs RCB: మొహాలి వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన..

IPL 2023, PBKS vs RCB: మొహాలి వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తలో ఆర్‌సీబీ తాత్వాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ(59), డూప్లెసిస్(84) పరుగులతో రాణించగా, హైదరాబాదీ ప్లేయర్ అయిన మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన సామ్ కర్రన్‌ని కింగ్ కోహ్లీ కొట్టబోయాడు. అవును, నిజంగా కొట్టబోయాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. సామ్ కుర్రాన్ వేసిన 16వ ఓవర్ తొలి బంతి డుప్లెసిస్ ముఖం మీదకి వెళ్లింది. అంతే, డూప్లెసిస్ కింద పడిపోయాడు. వెంటనే ఎంపైర్ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. మరోవైపు సామ్ కర్రన్ ‘సారీ’ అని చెప్తున్నట్లుగా సైగ చేశాడు. అలాగే డూ ప్లెసిస్ దగ్గరకు వచ్చి భుజం తట్టి సారీ చెప్పాడు. అంతలోనే అక్కడకు వచ్చిన కింగ్ కోహ్లీ తన చేత్తో సామ్ కర్రన్‌ని కొట్టబోతున్నట్లుగా పోజ్ ఇచ్చాడు. అంతే.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.




— CricDekho (@Hanji_CricDekho) April 20, 2023
కాగా, గాయం కారణంగా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మ్యాచ్‌కి దూరం కావడంతో సామ్ కర్రన్ ఆ టీమ్‌ని నడిపిస్తున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే సామ్ కర్రన్ అత్యంత ఖరీదైన(రూ. 18.5 కోట్లు) ఆటగాడని మనందరికీ తెలిసిందే. అలాగే ఫాఫ్ డూప్లెసిస్ కూడా గాయం కారణంగా ఫీల్డింగ్ చేయలేని పరిస్థితిలో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నారు. ఈ కారణంగానే గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీని విరాట్ కోహ్లీ నడిపించాడు.
