Healthy Heart: మీ చిట్టి గుండె ఆరోగ్యం కోసం రూ.2 ఖర్చు చేస్తే చాలు.. అదనంగా ఇంకెన్నో ప్రయోజనాలు కూడా..
Lemon Juice: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఎండలు మండిపోతున్నాయి. వాటికి తోడు తీవ్ర వడగాల్పులు. ఇంకా చెప్పుకోవాలంటే ఉదయం 8 గంటలకే మధ్యాహ్నాన్ని తలపించేలా సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఈ క్రమంలో బటయకు వెళ్తే....
Lemon Juice: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఎండలు మండిపోతున్నాయి. వాటికి తోడు తీవ్ర వడగాల్పులు. ఇంకా చెప్పుకోవాలంటే ఉదయం 8 గంటలకే మధ్యాహ్నాన్ని తలపించేలా సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఈ క్రమంలో బటయకు వెళ్తే.. వడదెబ్బకు లోనవడమే కాక డీహైడ్రేషన్, చర్మ సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. అయితే మండుతున్న ఎండల ప్రభావాన్ని మనపై పడకుండా ఉండాలంటే ఎండాకాలంలో నిత్యం నిమ్మరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం 2 రూపాయల నిమ్మకాయతో నిమ్మరసం మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వారు వివరిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో కూడా దగ్గు, జలుబు, అజీర్తి సమస్యలతో బాధపడేవారు, అలాగే బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా నిమ్మరసం తాగాలంట. నిమ్మరసం లేదా నిమ్మకాయలో ఉండే పోషకాలు ఆయా సమస్యలను నయం చేయడమే కాక శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తాయి. వేసవిలో నిమ్మరసం తాగితే డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అలాగే శరీరంలోని వేడిని నియంత్రించవచ్చు. అసలు వేసవి కాలంలో నిమ్మరసం తాగడం వల్ల ఇంకా ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
గుండె సంరక్షణ: నిమ్మరసంలో పుష్కలంగా ఉండే పొటాషియం గుండెను సంరక్షిస్తుంది. అంతేకాక ఇది రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పటిష్టమైన ఎముకలు: నిమ్మకాయలో ఉండే పోషకాలలో కాల్షియం కూడా ఒకటి. ఇది శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు, వాటిని పటిష్టపరిచేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల నిత్యం నిమ్మరసం తీసుకోవాలి.
రోగనిరోధక వ్యవస్థ: నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే . ఇది మానవ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాక సీజన్ వ్యాధుల నుంచి శరీరాన్ని సంరక్షిస్తుంది.
గొంతు నొప్పికి చెక్: నిమ్మరసం గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అందుకోసం గోరువెచ్చని నీళ్లలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చాలు. ఇంకా వేసవి ఎండలలో కూడా శరీరం చల్లగా ఉండాలంటే ఈ నిమ్మరసం తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
నో డీహైడ్రేషన్: సాధారణంగా వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, డీహైడ్రేషన్‌కు లోనవకుండా ఉండేందుకు ఎక్కువ మొత్తం నీళ్లు తాగుతుంటారు. అయితే వాటికి బదులుగా ప్రతి రోజూ ఒకే ఒక్క గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే చాలు, వేసవిలో డీహైడ్రేషన్ సమస్య మీ దరిచేరదు.
మెరుగైన జీర్ణవ్యవస్థ: నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ మానవ శరీరంలో డైజెస్టివ్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా జీర్ణక్రియను రెట్టింపు స్థాయిలో మెరుగుపడుతుంది. ఇంకా నిమ్మరసం అజీర్తి, కడుపు మంట, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలకు సహజ నివారణి. ఇంకా మెరుగైన జీర్ణ వ్యవస్థ కారణంగా అధిక బరువు ఉన్నవారు నిర్ధిష్ట కాలంలోనే బరువు తగ్గుతారు.
చర్మ సంరక్షణ: నిమ్మరసంలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి స్కిన్ టెక్స్చర్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మంపై ఉండే నిర్జీవ కణాలను తొలగించి వాటి స్థానంలో మళ్లీ చర్మం వచ్చేలా చేస్తుంది. ఇంకా అన్ని రకాల చర్మ సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది.
జలుబు, దగ్గుకు చెక్: నిమ్మరసంలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతునొప్పి సహా పలు రకాల సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. నిత్యం నిమ్మరసం తాగడం వల్ల ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..