AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా? ఉదయాన్నే పరగడుపున ఈ నీళ్లను తాగారంటే..

Ajwain Water: ఈ రోజుల్లో చాలామంది జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. వాటిల్లో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి. క్రమం తప్పిన ఆహార అలవాట్ల మూలంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతోంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే చిన్నవయసులోనే భరించలేని..

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా? ఉదయాన్నే పరగడుపున ఈ నీళ్లను తాగారంటే..
Ajwain Water
Srilakshmi C
|

Updated on: Apr 21, 2023 | 11:21 AM

Share

ఈ రోజుల్లో చాలామంది జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. వాటిల్లో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి. క్రమం తప్పిన ఆహార అలవాట్ల మూలంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతోంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే చిన్నవయసులోనే భరించలేని కీళ్ల నొప్పులు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. ఇతన ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ మూలంగా కీళ్ల నొప్పులతో సహా మధుమేహం, గుండె, మూత్రపిండాల సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఇన్ని అనార్థాలకు మూలమైన యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా నిరోధించడం చాలా అవసరం. ఐతే అందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. ట్యాబ్లెట్లతో కొందరు కుస్తీలు పడుతుంటారు. అయితే వీటిని తరచూ వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ట్యాబ్లెట్స్‌తో పని లేకుండా వంటింట్లో దొరికే వాముతో సహజ పద్ధతుల్లో నివారించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యానికి మేలు చేసే వాము (ఆజ్మా)లో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినట్లైతే.. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్ వాము కలిపి రాత్రంతా అలాగే ఉంచండి. ఈ నీటిని ఉదయాన్నే నిద్రలేవగానే వడకట్టి ఖాళీకడుపుతో తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం వాము నీటిని తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. చిన్న వయసులో కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది చక్కని పరిష్కారం. వాములోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.