AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో పెళ్లికి హార్దిక్ పాండ్యా రెడీ.. ఇన్‌స్టా ‘పింక్’ స్టోరీతో రివీల్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Hardik Pandya Mahikaa Sharma Marriage: మైదానంలో తన ఆటతోనే కాకుండా, వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే హార్దిక్ పాండ్యా, ఈసారి తన రెండో పెండ్లి వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇన్‌స్టా స్టోరీ ద్వారా వ్యక్తమవుతున్న ఈ సంకేతాలు నిజమై జులై 7న ఆయన పెండ్లి పీటలు ఎక్కుతాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

రెండో పెళ్లికి హార్దిక్ పాండ్యా రెడీ.. ఇన్‌స్టా ‘పింక్’ స్టోరీతో రివీల్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Hardik Pandya Mahikaa Sharma Marriage
Venkata Chari
|

Updated on: May 25, 2026 | 4:52 PM

Share

Hardik Pandya 2nd Marriage: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న హార్దిక్, త్వరలోనే రెండో పెండ్లి పీటలు ఎక్కబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. తాజాగా ఆయన పెట్టిన ఒక ఆసక్తికర ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన పాండ్యా..!

హార్దిక్ పాండ్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఒక ఫొటో ఇప్పుడు నెటిజన్లలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఆ ఫొటోలో ఒక ల్యాప్‌టాప్, డైరీ, మొబైల్ ఫోన్ కనిపిస్తున్నాయి. అయితే, వీటిలో దాగి ఉన్న కొన్ని చిన్న చిన్న అంశాలు ఆయన త్వరలోనే ఒక శుభవార్త చెప్పబోతున్నాడనే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా అందులోని టైమింగ్, రంగులు పెండ్లి ముచ్చట్లను గుర్తుచేసేలా ఉన్నాయని అభిమానులు లెక్కలు వేస్తున్నారు.

పింక్ సిటీ జైపూర్‌లో డ్రీమ్ వెడ్డింగ్..?

హార్దిక్ పోస్ట్ చేసిన ఫొటోలో గులాబీ రంగు (పింక్) డైరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్ స్క్రీన్, మొబైల్ ఫోన్ వాల్‌పేపర్ కూడా పింక్ కలర్‌లోనే ఉండడం గమనార్హం. దీంతో రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీగా పిలిచే జైపూర్‌లో హార్దిక్ పాండ్యా తన డ్రీమ్ వెడ్డింగ్ ప్రణాళికలు రచిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. బాలీవుడ్ సెలబ్రిటీలకు, స్టార్ క్రికెటర్లకు జైపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఆ 07:07 టైమింగ్ వెనుక మర్మమేంటి?

ఈ ఇన్‌స్టా స్టోరీలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన అంశం సమయం. మొబైల్ స్క్రీన్‌పై ‘07:07’ అని కనిపిస్తోంది. దీనిని గమనించిన నెటిజన్లు రాబోయే జూలై 7వ తేదీన (07వ నెల, 07వ తేదీ) హార్దిక్ వివాహం జరగబోతోందని అంచనా వేస్తున్నారు. జులై 7న ఈ స్టార్ క్రికెటర్ మళ్లీ పెండ్లి పీటలు ఎక్కడం ఖాయమని, అందుకే ఈ రకమైన హింట్స్ ఇస్తున్నాడని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.

గర్ల్‌ఫ్రెండ్ మహీకాతో లవ్ వైబ్స్..!

గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా ప్రముఖ మోడల్ మహీకా శర్మతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా పోస్ట్‌లో హార్ట్, ఫ్లైట్ ఎమోజీలను జత చేస్తూ మహీకాను హార్దిక్ ట్యాగ్ చేయడం విశేషం. వీరిద్దరి మధ్య ‘మ్యారేజ్ వైబ్స్’ మొదలయ్యాయని, త్వరలోనే ఈ జంట అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించవచ్చని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్