AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: అదృష్టమంటే ఈ రాశులదే.. అక్షయ తృతియ రోజే ‘రాజయోగం’.. ఇక పట్టిందల్లా బంగారం-చేసిందల్లా విజయం..

Akhand Samrajya Yoga 2023: సనాతన హిందూ ధర్మంలో అలాగే జ్యోతిష్య శాస్త్రాలలో బృహస్పతిని దేవతల గురువుగా పూజిస్తారు. అలాగే నవగ్రహాలలో కూడా ఈ బృహస్పతి గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురుగ్రహంగా కూడా ప్రసిద్ధి చెందిన బృహస్పతి కదలికలు..

Astrology: అదృష్టమంటే ఈ రాశులదే.. అక్షయ తృతియ రోజే ‘రాజయోగం’.. ఇక పట్టిందల్లా బంగారం-చేసిందల్లా విజయం..
Akhand Samrajya Yoga 2023; Jupiter
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 21, 2023 | 1:24 PM

Share

Akhand Samrajya Yoga 2023: సనాతన హిందూ ధర్మంలో అలాగే జ్యోతిష్య శాస్త్రాలలో బృహస్పతిని దేవతల గురువుగా పూజిస్తారు. అలాగే నవగ్రహాలలో కూడా ఈ బృహస్పతి గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురుగ్రహంగా కూడా ప్రసిద్ధి చెందిన బృహస్పతి కదలికలు మానవ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుందని నిపుణుల మాట. ఇక ఈ ప్రభావం అనేది కొందరికి శుభంగానూ, మరి కొందరికీ అశుభంగానూ ఉంటుంది. అయితే గురు గ్రహం ఈ నెల 22న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే రోజున హిందువులు అక్షయ తృతియను జరుపుకుంటారు. మరోవైపు అక్షయ తృతియ నాడే దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడనుంది. దీని ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులవారికి ఎనలేని అదృష్టం కలుగుతుంది. అంతేకాక ఈ సమయంలో వారు ఏ పని చేసినా లాభాల పంట అన్న మాదిరిగా ఉంటుంది అర్ధిక పరిస్థితి. మరి ఆ అదృష్టరాశులేమిటో.. అఖండ సామ్రాజ్య రాజయోగం ఎవరికి ఏ ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం..

అఖండ సామ్రాజ్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం..

1. మిథునరాశి: అక్షయ తృతియ రోజునే మేషరాశిలోకి గురు గ్రహం ప్రవేశించడం వల్ల అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడనుంది. మిథునరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రాజయోగం కారణంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ కాలంలో మీరు అదృష్టానికి అనుకూలమైన మలుపులను చూడవచ్చు. ఇంకా ఈ రాజయోగం మిథున రాశివారి కెరీర్‌లో గణనీయమైన పురోగతిని కలిగిస్తుంది. అంతేకాక వచ్చే ఏడాది వరకు కూడా కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు మీ ఆదాయంలో పెరుగుదలను గమనించవచ్చు. స్టాక్ మార్కెట్, లాటరీలలో పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి సమయం. 

2. సింహ రాశి: సింహ రాశి వారికి అఖండ సామ్రాజ్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బృహస్పతి ప్రభావం కారణంగా మీకు అదృష్టం పట్టుకుంటుంది. ఆ కారణంగా మీ కోరికలు నెరవేరడంతో పాటు మీరు అన్ని ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. ఇంకా మీకు మీ కుటుంబం నుంచి మద్ధతు లభిస్తుంది. సింహరాశిలో జన్మించిన పిల్లలకు, విద్యార్థులకు కూడా ఈ రాజయోగం ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఇంకా ఈ రాజయోగం కారణంగా సింహరాశివారికి సంతానయోగం కూడా ఉంది. మీరు ఈ సమయంలో భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

3. మకర రాశి: అఖండ సామ్రాజ్యం రాజయోగం మకరరాశివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మకరరాశివారి జాతక చక్రంలో నాల్గవ పాదం మీదుగా బృహస్పతి మేషరాశిలోకి  ప్రవేశించడమే ఇందుకు కారణమంట. ఇంకా ఈ రాజయోగ సమయంలో మకర రాశివారు ఆస్తి, వాహనాల కొనుగోలుకు అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సమయంలో మీకు ఉద్యోగంలో పదోన్నతి, సహోద్యోగులతో, పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మకర రాశివారికి ప్రభుత్వ కార్యాలయంలో కూడా కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి కళ్యాణ యోగం, వ్యాపారులకు అర్థిక లాభాలు తెచ్చేదిగా ఈ రాజయోగం ఉండనుంది. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..