AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో..! కిక్కిరిసిన జనాల్లో బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. ఆ తర్వాత సీన్‌ ఊహించలేం..!

ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సర్కస్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. ఆ సింహాలు ఎలా తప్పించుకున్నాయనేది మాత్రం సర్కస్‌ నిర్వాహకులు వెల్లడించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను

వామ్మో..! కిక్కిరిసిన జనాల్లో బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. ఆ తర్వాత సీన్‌ ఊహించలేం..!
Circus Lion Escapes
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2023 | 2:10 PM

Share

సర్కస్‌లో విన్యాసాలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న జనాలకు ఒక్కసారిగా ఊహించని సంఘటన భయబ్రాంతులకు గురిచేసింది. సర్కస్‌లో ఫీట్లు చేస్తున్న రెండు సింహాలు ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకుని ఒక్కసారిగా జనంపైకి దూసుకువచ్చాయి. ఇక అప్పుడు చూడాలి అక్కడి ప్రజల పరిస్థితి. సర్కస్‌ చూసేందుకు వచ్చిన ప్రజలంతా..వారి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

చైనాలో ప్రత్యక్ష ప్రదర్శన సందర్భంగా రెండు సర్కస్ సింహాలు తమ ఎన్‌క్లోజర్ నుండి తప్పించుకున్న వీడియో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, సింహాలు బయటకు దూకడంతో ప్రేక్షకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సర్కస్‌లో పనిచేస్తున్న శిక్షకులు, పెంపకందారులు వారి వారి పిల్లులను పట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిసింది. ఈ సర్కస్‌ ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ రింగ్‌ లోంచి దూకేందుకు సింహాలు మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్‌ చేయని డోర్‌ నుంచి రెండు సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి. దీంతో గ్యాలరీల్లో కూర్చొని వీక్షిస్తున్న జనానికి ఏం చేయాలో తెలియక భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అప్రమత్తమైన నిర్వాహకులు ఆ సింహాలను త్వరగా పట్టుకొని తిరిగి బోనులో బంధించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సర్కస్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. ఆ సింహాలు ఎలా తప్పించుకున్నాయనేది మాత్రం సర్కస్‌ నిర్వాహకులు వెల్లడించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో @WeAreNotFood షేర్ చేశారు.

వైరల్‌గా మారిన వీడియోలో సింహాలలో ఒకటి సర్కస్ వెలుపల తిరుగుతూ కనిపించింది. ప్రేక్షకులు, పర్యాటకులు భయంతో పరుగులు తీయటం కనిపించింది. సింహాన్ని పట్టుకున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. వీడియోలు కూడా సింహాన్ని బోనులో బంధించినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..