Viral video: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడుగా.. ఒక్క క్షణం అటుఇటైనా.. జీవితం తలకిందులైయ్యేది.
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరిగిపోతుందనే సామెత ఉంది. అలాగే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా ఇట్టే తప్పించుకోగలము. అలా పెను ప్రమాదం నుంచి తప్పించుకునే వారినే అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడుగా అంటుంటాం. అయితే ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం...

అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరిగిపోతుందనే సామెత ఉంది. అలాగే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా ఇట్టే తప్పించుకోగలము. అలా పెను ప్రమాదం నుంచి తప్పించుకునే వారినే అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడుగా అంటుంటాం. అయితే ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియోను చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. ఇంతకీ ఏంటా వీడియో..? అందులో అంతలా ఎముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
హైవేపై ఓ వ్యక్తి కారులో వెళుతున్నాడు. అయితే ప్రయాణ సమయంలో రోడ్డును తన స్మార్ట్ ఫోన్‌లో రికార్డు చేయడం ప్రారంభించాడు. ఇక కారు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ముందుగా ఓ భారీ ట్రాక్కు వేగంగా దూసుకెళ్తోంది. అదే సమయంలో కారును ఓటర్ టేక్ చేస్తూ ఓ వ్యక్తి బైక్‌పై దూసుకొచ్చాడు. ట్రక్‌ని కూడా ఓవర్ టైక్ చేద్దామన్న ఆలోచనతో ముందుకు దూసుకెళ్లాడు.




అంతలోనే పెద్ద మలుపు వచ్చింది. అయితే చాలా బరువుతో వెళ్తున్న ఆ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్. ట్రక్ కాస్త టర్న్ అవ్వగానే కంటైనర్ కుడివైపు పడింది. సరిగ్గా కంటైనర్ పడుతున్న సమయంలో బైకర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో క్షణాల్లో ప్రాణాలను కాపాడుకున్నాడు. బైకర్ బ్రేక్ వేయడంలో ఏమాత్రం అటు ఇటైనా ప్రాణాలే కోల్పోయేవాడు. అయితే అదృష్టం కలిసొచ్చి క్షణాల్లో బచాయించాడు. ఇదంతా వెనకాల కార్లో ఉన్న వాళ్లు రికార్డు చేశారు. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. బైక్‌పై వెళుతోన్న వ్యక్తి అదృష్టాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Thou shall not pass! pic.twitter.com/63yTZSlcv0
— Vicious Videos (@ViciousVideos) April 18, 2023
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
