Crocodile vs Man: పోయే కాలం వచ్చిందేమో..! మొసలితోనే ఆటలు.. మండి పడుతున్న నెటిజన్లు.. అసలేమయ్యిందంటే..?

భూమి మీద సింహం, పులి, చిరుత వంటివి ఎంత ప్రమాదకరమో.. నీటిలో మొసళ్లు, కొన్ని రకాల చేపలు అంతే ప్రమాదం. వాటి చేతుల్లో పడ్డామంటే స్వర్గానికి ద్వారాలు తెరుచుకున్నట్లే. ఇక ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పడరాని పాట్లు

Crocodile vs Man: పోయే కాలం వచ్చిందేమో..! మొసలితోనే ఆటలు.. మండి పడుతున్న నెటిజన్లు.. అసలేమయ్యిందంటే..?
Crocodile vs Man
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 21, 2023 | 2:00 PM

భూమి మీద సింహం, పులి, చిరుత వంటివి ఎంత ప్రమాదకరమో.. నీటిలో మొసళ్లు, కొన్ని రకాల చేపలు అంతే ప్రమాదం. వాటి చేతుల్లో పడ్డామంటే స్వర్గానికి ద్వారాలు తెరుచుకున్నట్లే. ఇక ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పడరాని పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. వారికి సంబంధించిన వీడియోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రబుద్ధుడి వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘తగిన శాస్తి జరిగింది’, ‘అలా జరగాల్సిందే’ అంటూ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఆసలు వీడియోలోని వ్యక్తి చేసిన ఘనకార్యం ఏమిటంటే.. తను ఆడుకోవడానికి ఎవరు లేరన్నట్లుగా పోయిపోయి మొసలి నోట్లో తన చేతిని పెట్టాడు. సింహం నొట్లో తల పెడితే అది ఊరుకుంటుందా.. ఆహారం దొరికిందని పండగ చేసుకుంటుంది. అలాగే ఈ ముసలి కూడా ఆ వ్యక్తి చేతిని ఒక్క సరిగా తన బలమైన పళ్లతో పట్టేసుకుంది. అంతే.. చేసిన తప్పుకు తెలుసుకున్న అతను వెంటనే తన చేతిని మొసలి నోటి నుంచి బయటకు తీసేందుకు కొట్టుమిట్టాడాడు. అలా కొన్ని సెకన్లలోనే మొసలి నోటి నుంచి తన చేతిని బయటకు తీసి, దానికి దూరంగా జరిగాడు. మొసలి బలంగా కొరకడం వల్ల అతని చేతి నుంచి రక్తం కూడా వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, వీడియోలోని వ్యక్తి చేసిన మూర్ఖపు పనికి నెటిజన్లు అతనిపై మండిపడుతున్నాడు. ‘క్రూర జంతువులు ఊహించని విధంగా స్పందిస్తుంటాయి.వాటికి దూరంగా ఉండు’ అంటూ ఓ నెటిజన్ అతనికి సలహా ఇచ్చాడు. అలాగే ఇంకో నెటిజన్ ‘ఇంకా సంతోషం. ఆ మొసలి స్వయంగా అతని మీదకు రాలేదు. వచ్చి ఉంటే అతని చెయ్యి మాయమయ్యేది’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే ‘మూర్ఖులు అంటే ఇలాంటివారే. తెలిసి తెలిసి చావు నోట్లో తల పెడుతుంటారు’ అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన 10 వేల వీక్షణలు, 500 పైగా లైకులు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్  చేయండి..