IPL 2023: ఢిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌లో యాపిల్ సీఈవో సందడి.. ఐఫోన్స్ కావాలంటూ నెటిజన్ల కామెంట్స్..
Delhi Capitals vs Kolkata Knight Riders, IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2023లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా స్టేడియానికి చేరుకున్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2023లో తమ ఖాతా తెరిచింది. అయితే, కోల్‌కతా అందించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్టకష్టాలు పడింది. వరుసగా 5 ఓటముల తర్వాత ఢిల్లీ టీం విజయం సాధించింది. ఈ తొలి విజయం ఆ జట్టుతోపాటు ఫ్యాన్స్‌లోనూ సంతోషాన్ని నింపింది. కాగా, ఈ మ్యాచ్‌కు మరో స్పెషాలిటీ ఉంది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్టేడింయలో సందడి చేశాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో హీట్ పెరిగింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు కావాలి. కోల్‌కతా చేసిన ఒక చిన్న పొరపాటుతో ఢిల్లీ విజయాన్ని లాగేసుకుంది. ఇరు జట్లలోనూ టెన్షన్ స్పష్టంగా కనిపించింది. చివరి ఓవర్ డ్రామా చూసి యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ఆశ్చర్యపోయారు.
మ్యాచ్ అనంతరం టిమ్ కుకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో కుక్ వీడియోను షేర్ చేసింది. ఇందులో అతను ఐపీఎల్‌కు సంబంధించి తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఫుల్ జోష్‌లో టిమ్ కుక్..
2016లో కుక్ భారత్ వచ్చినప్పుడు కాన్పూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూశాడు. ఆ తర్వాత మ్యాచ్‌ని చూసి తనలో ఉత్సాహం మరింత పెరిగిందని చెప్పుకొచ్చాడు. 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియా వచ్చినప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ చూడటం మరిచిపోలేదు. ఈ రెండు అనుభవాలను నెట్టింట్లో పంచుకున్నారు. నిజానికి ఆపిల్ స్టోర్ లాంచ్‌కు సంబంధించి టిమ్ కుక్ ఢిల్లీలో ఉన్నారు.
ప్రత్యేక బ్యాట్ బహుమతి..
View this post on Instagram
భారతదేశంలోని మొదటి ఆపిల్ స్టోర్‌ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో తొలి స్టోర్‌ను ప్రారంభించారు. తన పర్యటనలో చివరి రోజు కుక్ రెండవ ఆపిల్ స్టోర్‌ను ఢిల్లీలో ఓపెన్ చేశాడు. తన బిజీ షెడ్యూల్‌లో సమయాన్ని వెచ్చించి, ఢిల్లీ, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ని చూడటానికి స్టేడియానికి చేరుకున్నాడు.
?| Our Co-owners welcomed Tim Cook, CEO, Apple Inc. at #QilaKotla tonight and presented some DC mementos ?#YehHaiNayiDilli #IPL2023 #DCvKKR pic.twitter.com/wY4WZIHHHc
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2023
ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్త్ జిందాల్, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా కూడా కుక్‌తో పాటు స్టేడియంలో కనిపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పార్థ్ జిందాల్ అతనికి ప్రత్యేక బ్యాట్, జెర్సీని బహుమతిగా ఇచ్చారు.