- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: RCB to wear green colour jersey in Next Match vs RR, know their records with this jersey
IPL 2023: ‘గో గ్రీన్’ జెర్సీలతో మ్యాచ్ ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్స్.. ఈసారైనా అచ్చొచ్చేనా?
IPL 2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి RCB తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది. బెంగళూరు తన తదుపరి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ప్రిల్ 23న జరిగే మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం. ఎందుకంటే గ్రీన్ గేమ్ ప్రచారంతో రాజస్థాన్ రాయల్స్‌తో RCB బరిలోకి దిగనుంది.
Updated on: Apr 21, 2023 | 1:58 PM

IPL 2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి RCB తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది. బెంగళూరు తన తదుపరి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.

ఏప్రిల్ 23న జరిగే మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం. ఎందుకంటే గ్రీన్ గేమ్ ప్రచారంతో రాజస్థాన్ రాయల్స్‌తో RCB బరిలోకి దిగనుంది.

మ్యాచ్‌లో RCB ఆటగాళ్లు ఆకుపచ్చ జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు. చెట్లను రక్షించడం, పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గో గ్రీన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది ఆర్సీబీ ఫ్రాంచైజీ

2011 నుండి ఏటా ఈ గో గ్రీన్ జెర్సీ మ్యాచ్ ధరించి మ్యాచ్ ఆడుతోంది ఆర్సీబీ. విశేషమేమిటంటే, ఈ మ్యాచ్‌లో RCB గ్రీన్ జెర్సీ 100% రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేశారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు పునర్వినియోగాన్ని కూడా ప్రోత్సహించనున్నారు.

ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఈ గ్రీన్ గేమ్ జరగడం విశేషం. 2019లో చివరిసారిగా RCB స్వదేశంలో గ్రీన్ గేమ్ ఆడింది. మూడేళ్ల తర్వాత మళ్లీ గ్రీన్ జెర్సీలో ఆడుతోంది

అయితే గ్రీన్ జెర్సీ వేసుకుని ఆడిన మ్యాచ్ లలో ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆకుపచ్చ జెర్సీలో 12 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. మూడు మ్యాచ్ లలో మాత్రమే నెగ్గింది. 8 మ్యాచ్ లలో ఓడిపోయింది.





























