Dhone: ఆస్తి కోసం కొడుకునే కిడ్నాప్ చేయించాడు.. మాట వినకపోవడంతో మనమరాలి మెడపై కత్తి పెట్టి..

కొడుకు కులాంతర వివాహం చేసుకన్నాడని తండ్రి రగిలిపోయాడు. అతడికి చిల్లి గవ్వ కూడా ఆస్తి దక్కకూడదని భావించాడు. మాట వినడం లేదని.. ఏకంగా సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడి.. ఆస్తి లాగేసుకునే ప్రయత్నం చేశాడు. వివరాలు తెలుసుకుందాం పదండి..

Dhone: ఆస్తి కోసం కొడుకునే కిడ్నాప్ చేయించాడు.. మాట వినకపోవడంతో మనమరాలి మెడపై కత్తి పెట్టి..
Victim Vinod with his daughter
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 22, 2023 | 11:09 AM

తండ్రి ఆస్తి కోసం కొడుకులు హత్య చెయ్యడం చూశాం. కానీ ఇది పూర్తి భిన్నం. డోన్‌లో ఉంటున్న నిరంజన్‌, అతని కుమారుడు వినోద్ మధ్య ఈ సంవాదం జరిగింది. వినోద్ కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కొడుకు పేర మీద ఉన్న ఆస్తి అంతా ఇచ్చేయాలని తండ్రి వేధింపులు మొదలుపెట్టాడు. మామూలుగా చెబితే ఇవ్వడం లేదని.. ఏకంగా ఓ సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడాడు. కిడ్నాపర్ల కోసం రెండు ఇన్నోవా కార్లు కూడా మాట్లాడాడు. ఆ తర్వాత మార్కెట్‌ యార్డ్‌లో కొడుకుని, అతని కూతుర్ని ఉన్నారని తెలిసి కిడ్నాప్ చేయించాడు. ఆస్తి పేపర్లపై సంతకాలు పెట్టమని కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ వినోద్ సంతకాలు పెట్టకపోవడంతో సినిమాటిక్ స్టయిల్లో క్రూరత్వం చూపించారు. వినోద్ కూతురు మెడపై కత్తిపెట్టి.. ఆస్తి రాసిస్తావా, చంపమంటావా అంటూ హత్యకు ప్రయత్నించారు. చేసేదేమీ లేక కూతురు ప్రాణం కోసం పత్రాలపై సంతకం చేసి బయటపడ్డాడు వినోద్..

బయటకు రాగానే తండ్రి దాష్టీకాన్ని, కిడ్నాపర్ల వేధింపులను పోలీసులకు చెప్పాడు వినోద్‌. డోన్ పట్టణ పోలీసులు పట్టించుకోకపోవడంతో నంద్యాల ఎస్పీ దృష్టికి విషయం తీసుకెళ్లాడు వినోద్‌. ప్రస్తుతం సుపారీ గ్యాంగ్‌లో కొందరు పోలీస్‌ల అదుపులో ఉన్నారు. అసలు సూత్రధారి అయిన తండ్రి నిరంజన్‌ పరారీలో ఉన్నాడు. ఇప్పడే కాదు.. తర్వాత కూడా తండ్రి నుంచి సుపారీ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉందంటున్నాడు వినోద్. చిన్నపాపే అయినా.. తన కూతుర్ని కూడా చంపడానికి వెనకాడరని భయపడుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం