TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో గ్రాండ్ సక్సెస్.. పలువురి సొంతింటి కల సాకారం..
తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నవారి కోసం.. TV9 తెలుగు నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ‘టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్ ఎక్స్‌పో..
TV9 Sweet Home 2023: తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నవారి కోసం.. TV9 తెలుగు నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ‘టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్ ఎక్స్‌పో’ కూడా ఒకటి. ఈ క్రమంలోనే ఇటు కొనుగోలు దారులకు, అటు ప్రధాన రియల్ ఎస్టేట్ సంస్థలకు అత్యంత విశ్వసనీయ వేదికగా టీవీన9 ఖ్యాతిని గడించింది. దాదాపు దశాబ్ద కాలంగా టీవీ9 నిర్వహిస్తోన్న ‘టీవీ9 స్వీట్ హోమ్’ ఈ ఏడాది కూడా విజయవంతంగా ముగిసింది. ఏప్రిల్ 14,15,16 తేదీల్లో 3 రోజుల పాటు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహించిన ఈవెంట్‌లో.. రియల్ ఎస్టేట్, దాని అనుబంధ పరిశ్రమల నుంచి 100 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
అలాగే ఔత్సాహిక కొనుగోలుదారుల కోసం 400 కంటే ఎక్కువ ప్రాపర్టీ వెంచర్‌లను ప్రదర్శించారు. ఈ ఎక్స్‌పో కార్యక్రమం గృహ కొనుగోలుదారులు, ప్రాపర్టీ కొనుగోలుదారులు, ఫర్నీచర్, హోమ్ డెకర్, ఇంటీరియర్ డిజైన్‌ల కోసం ఒక స్టాప్ వేదికగా మారింది. మరోవైపు 3 రోజుల ఈ ఈవెంట్‌కి 25,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు.
కాగా, ఏప్రిల్ 14న ఈ ‘టీవీ9 స్వీట్ హోమ్’ని తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘భారత మార్కెట్‌లో, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏడాదికేడాది పెరుగుతోంది, ఇంకా అనేక గ్లోబల్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఔత్సాహిక కస్టమర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించినందుకు TV9కి అభినందనలు’ అని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..