AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తడిబడ్డలతో ప్రమాణానికి రావాలని ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ .. ఈటల ఏమన్నారంటే

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొట్టారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Revanth Reddy: తడిబడ్డలతో ప్రమాణానికి రావాలని ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ .. ఈటల ఏమన్నారంటే
Eetala Rajendhar And Revanth Reddy
Aravind B
|

Updated on: Apr 22, 2023 | 12:12 PM

Share

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొట్టారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి.. కాంగ్రెస్ కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే ఈ ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. అలాంటి వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడటం సమంజసం కాదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటల చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తేల్చేందుకు శనివారం భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్దమేనని.. తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ఈటల సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అక్కడికి రావాలని ఈటలను కోరారు. శనివారం సాయంత్రం రేవంత్ తన ఇంటి నుంచి భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లనున్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన సవాలుపై స్పందించకూడదని ఈటల రాజేంధర్ నిర్ణయించుకున్నారు. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల్లోనే సమాధానం ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!