PSLV C55: పీఎస్‌ఎల్వీ ప్రయోగానికి కౌంట్‌డౌన్.. నింగిలోకి సింగపూర్ శాటిలైట్స్..
పీఎస్‌ఎల్‌వీ-సీ55 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరి కోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి55 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది ఇస్రో. రాకెట్ ప్రయోగానికి నిన్న మధ్యాహ్నం 12.49 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరి కోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి55 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది ఇస్రో. రాకెట్ ప్రయోగానికి నిన్న మధ్యాహ్నం 12.49 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సుమారు 26గంటల కౌంట్‌డౌన్ తర్వాత పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్.. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్-2, 16 కిలోల లూమ్‌లైట్-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
టెలియోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది కాగా.. దానిని వివిధ ఏజెన్సీల అవసరాలకు వినియోగించనున్నారు. లూమ్‌లైట్-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ కలిసి అభివృద్ధి చేశాయి. సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది.
త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య ప్రయోగాలు..
పీఎస్ఎల్వీ సీ-55 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. కౌంట్‌డౌన్ ప్రక్రియకు ముందు సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైనదని 5వ రాకెట్ ప్రయోగమని చెప్పారు డాక్టర్ సోమనాథ్. త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య లాంటి అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు ఇస్రో చైర్మన్.
మొత్తంగా.. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే.. ఇస్రో మరో రాకెట్ ప్రయోగించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకోబోతుంది. అందుకే.. ఈ పీఎస్‌ఎల్‌వీ సీ-55 రాకెట్ ప్రయోగమూ సక్సెస్ అయి.. ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించాలని టీవీ9 కూడా కోరుకుంటోంది.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..