Galaxy Watch5: మహిళలకు ఆ సమయంలో బాగా ఉపయోగపడే స్మార్ట్ వాచ్ ఇది.. హెల్త్ ఫీచర్లతో పాటు ఫిట్‌నెస్ ట్రాకర్ కూడా..

గేలాక్సీ వాచ్ 5, గేలాక్సీ వాచ్ 5 ప్రో పేరిట రెండు స్మార్ట్ వాచ్ లను తీసుకురానుంది. వీటిలో ఉండే ఫీచర్ల గురించి ఓ కీలక అప్ డేట్ ను శామ్సంగ్ రివీల్ చేసింది. వాటిల్లో ప్రత్యేకంగా మహిళల కోసం రుతుచక్రం ట్రాకింగ్(మెనుస్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్), అలాగే శరీర ఉష్ణోగ్రత ను తెలియజేసే సెన్సార్స్ తో రానున్నట్లు ప్రకటించింది.

Galaxy Watch5: మహిళలకు ఆ సమయంలో బాగా ఉపయోగపడే స్మార్ట్ వాచ్ ఇది.. హెల్త్ ఫీచర్లతో పాటు ఫిట్‌నెస్ ట్రాకర్ కూడా..
Galaxy Watch 5
Follow us
Madhu

|

Updated on: Apr 21, 2023 | 3:00 PM

ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయ గ్యాడ్జెట్లలో స్మార్ట్ వాచ్ కూడా ఒకటి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అందులో ఉంటున్న అత్యాధునిక ఫీచర్లు వినియోగదారుల మనసు దోచుకుంటున్నాయి. ఫలితంగా ఓ ట్రెండీ ఐటెంలా స్మార్ట్ వాచ్ మారిపోయింది. ఈ డిమాండ్ కు అనుగుణంగానే మరిన్ని ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ తో పాటు అనువైన బడ్జెట్లో కొత్త స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో శామ్సంగ్ కూడా ఓ కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. శామ్సంగ్ గేలాక్సీ వాచ్ 5 సిరీస్ తో రాబోతోంది. గేలాక్సీ వాచ్ 5, గేలాక్సీ వాచ్ 5 ప్రో పేరిట రెండు స్మార్ట్ వాచ్ లను తీసుకురానుంది. వీటిలో ఉండే ఫీచర్ల గురించి ఓ కీలక అప్ డేట్ ను శామ్సంగ్ రివీల్ చేసింది. వాటిల్లో ప్రత్యేకంగా మహిళల కోసం రుతుచక్రం ట్రాకింగ్(మెనుస్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్), అలాగే శరీర ఉష్ణోగ్రత ను తెలియజేసే సెన్సార్స్ తో రానున్నట్లు ప్రకటించింది. ఇది శామ్సంగ్ హెల్త్ యాప్ ద్వారా పనిచేసేలా తీర్చిదిద్దినట్లు పేర్కొంది. మొదటిగా ఈ వాచ్ లు యూఎస్ఏ, సౌత్ కోరియా మార్కెట్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

చర్మ ఉష్ణోగ్రత చెబుతుంది..

గేలాక్సీ వాచ్ 5, గేలాక్సీ వాచ్ 5 ప్రో స్మార్ట్ వాచ్ లలో స్కిన్ టెంపరేచ్ సెన్సార్స్ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన ఫీచర్ కాదు. ఇప్పటి వరకూ ఏ స్మార్ట్ వాచ్ లోనూ ఈ ఫీచర్ లేదు. ఇది బ్యాక్ గ్రౌండ్ పనిచేస్తూనే ఉంటుంది. అలాగే మెనుస్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ ను కూడా ఈ స్కిన్ టెంపరేచర్ సెన్సార్ సాయంతోనే నిర్వహిస్తుందని కంపెనీ ప్రకటించింది.

నేచురల్ సైకిల్స్ తో కలిసి..

గేలాక్సీ వాచ్ 5, గేలాక్సీ వాచ్ 5 ప్రో స్మార్ట్ వాచ్ లలో తీసుకొస్తున్న కొత్త ఫీచర్లు స్కిన్ టెంపరేచర్ సెన్సార్ మెనుస్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ లను సక్రమంగా పనిచేసేలా చేసేందుకు శామ్సంగ్ నేచురల్ సైకిల్స్ అనే కంపెనీతో కలిసి పనిచేస్తోంది. నిద్ర పోయే లేచినప్పుడు, నిద్ర పోతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి అత్యాధునిక ఇన్ ఫ్రారెడ్ టెంపరేచర్ సెన్సార్లు అవసరం అవుతాయి. దీని కోసం శామ్సంగ్ నేచురల్ సైకిల్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టెంపరేచ్ సెన్సార్ ద్వారా మహిళల్లో రుతుచక్ర సమయానికి కచ్చితంగా లెక్కించడానికి ఇది ఉపకరిస్తుంది. తద్వారా మహిళలకు ఇది బాగు ఉపయుక్తం అవుతుంది. ఈ వాచ్ లు మహిళలకు దీనికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు కూడా అందిస్తుంది. ఆ సమయంలో నొప్పిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా వినియోగించాలంటే..

ఈ వాచ్ ల ద్వారా రుతు క్రమాన్ని లెక్కించాలంటే మొదటగా మహిళలు వారి పీరియడ్ డేట్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత శామ్సంగ్ హెల్త్ యాప్ లో ఉన్న ప్రెడిక్ట్ పీరియడ్ విత్ స్కిన్ టెంప్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత ఇది ఆటోమేటిక్ గా రుతక్రమాన్ని లెక్కిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే