Split Bills: విభజించు.. చెల్లించు.. గూగుల్ పేలో అదిరే ఫీచర్.. పూర్తి వివరాలు ఇవి..

మీరు నెలకు రూ.10,000 బిల్లు చెల్లించాలనుకుందాం. దీనిని ముగ్గురు కలిసి చెల్లించాలనుకోండి. ఈ ఫీచర్ మీకు బాగా ఉపకరిస్తుంది. బిల్లు మొత్తాన్ని స్ప్లిట్ చేసి ముగ్గురు ఎంతెంత చెల్లించాలో లెక్కించి యాపే చూపిస్తుంది. ఆ మొత్తం వారు చెల్లించేలా రిమైండర్లు కూడా పంపుతుంది.

Split Bills: విభజించు.. చెల్లించు.. గూగుల్ పేలో అదిరే ఫీచర్.. పూర్తి వివరాలు ఇవి..
Split And Pay
Follow us
Madhu

|

Updated on: Apr 21, 2023 | 1:56 PM

మన దేశంలో డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో డిజిటలీకరణ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్ వైపే మొగ్గుచూపుతున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి పే మెంట్ యాప్ ల రంగ ప్రవేశంతో బ్యాంకింగ్ ముఖచిత్రమే మారిపోయింది. లావాదేవి చిన్నదైనా, పెద్దదైనా అంతా ఈ పేమెంట్ యాప్ లపైనే ఆధారపడుతున్నారు. మరి పెద్ద మొత్తం అయితే తప్ప బ్యాంకులవైపు చూడటం లేదు. ఈ క్రమంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్ లు కూడా తన వినియోగదారులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడానికి కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో పాపులర్ ఆన్​లైన్ పేమెంట్ ప్లాట్​ఫామ్ గూగుల్ పే ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్​ ద్వారా మీ కాంటాక్ట్​ లిస్ట్​లోని స్నేహితులు, కుటుంబ సభ్యులకు బిల్లును విభజించి సులభంగా పేమెంట్​ చేయవచ్చు. ప్రతి వ్యక్తికి ఎంత చెల్లించాలని మాన్యువల్‌గా లెక్కించాల్సిన అవసరాన్ని ఈ ఫీచర్​ తొలగిస్తుంది. ఈ ఫీచర్ ను ఎలా వినియోగించుకోవాలో చూద్దాం రండి..

బిల్లును విభజించి.. పే చేయొచ్చు..

ఈ ఫీచర్ గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ ఉదాహరణను చూడండి.. మీరు నెలకు రూ.10,000 బిల్లు చెల్లించాలనుకుందాం. దీనిని ముగ్గురు కలిసి చెల్లించాలనుకోండి. ఈ ఫీచర్ మీకు బాగా ఉపకరిస్తుంది. బిల్లు మొత్తాన్ని స్ప్లిట్ చేసి ముగ్గురు ఎంతెంత చెల్లించాలో లెక్కించి యాపే చూపిస్తుంది. ఆ మొత్తం వారు చెల్లించేలా రిమైండర్లు కూడా పంపుతుంది. దీనిని ఎలా వినియోగించుకోవాలో చూద్దాం రండి..

గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి..

గూగుల్ పేని ఓపెన్ చేసి మెయిన్ పేజీలో ఉన్న ‘పే కాంటాక్ట్స్’ ఆప్షన్​పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్‌ కింద ‘న్యూ గ్రూప్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్​పై క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్స్ పేర్లతో కొత్త స్క్రీన్ ఓపెన్​ అవుతుంది. మీ ఇటీవలి గూగుల్​పే కాంటాక్ట్స్‌ లిస్ట్​ను ఇక్కడ చూడవచ్చు. లిస్ట్​లో నుంచి మీరు బిల్లును విభజించాలనుకుంటున్న కాంటాక్ట్​లపై నొక్కండి. తర్వాత స్క్రీన్​లో మీ గ్రూప్​కు పేరు పెట్టండి. గ్రూప్​ను క్రియేట్ చేయండి.

ఇవి కూడా చదవండి

స్ప్లిట్ యాన్ ఎక్స్‌పెన్స్..

ఆ తర్వాత, కింది భాగంలో కనిపించే ‘స్ప్లిట్ యాన్ ఎక్స్‌పెన్స్’ బటన్‌పై క్లిక్ చేయండి. గ్రూప్ సభ్యుల మధ్య విభజించాల్సిన మొత్తాన్ని నమోదు చేయండి. అది ఆటోమేటిక్ గా మొత్తాన్ని సమ భాగాలుగా విభజిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ‘సెండ్ రిక్వెస్ట్’ బటన్‌ను నొక్కండి. మీ పేమెంట్ ప్రోగ్రెస్‌ని గ్రూప్ మెయిన్ స్క్రీన్ నుండి ట్రాక్ చేయవచ్చు. అలాగే గ్రూప్ లోని సభ్యుడు చెల్లించాల్సిన మొత్తం గురించి ఆ సభ్యుడికి రిమైండర్ కూడా పంపే వీలుంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే