Personal Air Cooler: హాట్ హాట్ సమ్మర్‌లో చిల్లింగ్ న్యూస్.. జస్ట్ రూ. 242 పే చేసి ఆ కూలర్ తీసుకెళ్లొచ్చు..
వేసవి కాలం వచ్చేసింది. ఎండ దంచికొడుతుంది. బయటకెళితేనే కాదు.. ఇంట్లో ఉన్నా.. వేడి తాళలేక చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ వేడిమికి తారు రోడ్లు సైతం కరిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బతో ఆస్పత్రుల పాలవుతున్నారు.
వేసవి కాలం వచ్చేసింది. ఎండ దంచికొడుతుంది. బయటకెళితేనే కాదు.. ఇంట్లో ఉన్నా.. వేడి తాళలేక చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ వేడిమికి తారు రోడ్లు సైతం కరిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉపశమనం కోసం కూలర్, ఏసీని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. ఇంట్లో ఏసీ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, లేనివారు కూలర్ గానీ, ఏసీ గానీ కొనాలని భావిస్తారు. అయితే, ఏసీ కొనడం అందరివల్ల అయ్యేపని కాదు. సామాన్యులు కాస్త తటపటాయించాల్సి పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతారు. కూలర్ వంటివి కొనుగోలు చేసేందుకు చూస్తాు. ఆ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారికి, అద్భుమైన న్యూస్ తీసుకొచ్చాం. అతి తక్కువ ధరకే పర్సనల్ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఎండలో బయటకు వెళ్తున్నట్లయితే.. దీనిని మీ వెంట కూడా తీసుకెళ్లవచ్చు. ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆన్‌టెల్ అనే కంపెనీ.. ఈ మినీ పర్సనల్ కూలర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది ధరించడానికి అనువుగా ఉండే మినీ ఏసీ అని చెప్పొచ్చు. దాని ధర, ఫీచర్స్, ఇతర వివరాలు తెలుసుకుందాం..
ఆర్కిటిక్ ఎయిర్ ఫ్రీడమ్ పోర్టబుల్ పర్సనల్ ఎయిర్ కూలర్..
ఈ ఎయిర్ కూలర్ పేరు ఆర్కిటిక్ ఎయిర్ ఫ్రీడమ్. ఈ పోర్టబుల్ పర్సనల్ ఎయిర్ కూలర్ ధర రూ.5,065. ఈ కామర్స్ సైట్ అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ కూలర్‌ను కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. HSBC క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీకు రూ.250 వరకు తగ్గింపు లభిస్తుంది.
అంతేకాదు.. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌ను తక్కువ ఖర్చుతో, సులభంగా కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ EMI ఎంపికపై కూలర్‌ను కొనుగోలు చేస్తే.. నెలకు రూ. 228 పే చేస్తే సరిపోతుంది. స్టాండర్డ్ EMI ఆప్షన్‌పై కూలర్‌ను కొనుగోలు చేస్తే నెలకు రూ. 242 చెల్లిస్తే సరిపోతుంది.
ప్రత్యేకతలు ఏంటంటే..
ఈ కార్డ్‌లెస్ పర్సనల్ కూలర్ చల్లని గాలిని అందిస్తుంది. తక్షణమే రిఫ్రెష్ గాలిని పొందవచ్చు. దీనిని మెడకు అమర్చుకోవచ్చు. ఆ తరువాత దీనిని ఆన్ చేస్తే చల్లటి గాలి వస్తుంది. చాలా తక్కువ బరువుతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఆర్కిటిక్ ఎయిర్ ఫ్రీడమ్ కూలర్ వేడి గాలిని లాగి, చల్లటి గాలి వ్యాపింపజేస్తుంది. తేలికైన పరికరాన్ని ధరించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. మరీ ముఖ్యంగా మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
ఈ ఎయిర్ కూలర్ ఫ్యాన్.. 3 స్పీడ్ రేంజ్‌లో తిరుగుతుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా గంటల పాటు నడుస్తుంది. ఇంట్లో, బయట ఎక్కడైనా దీనిని వాడుకోవచ్చు. నడుస్తున్నప్పుడు గానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ, ఎప్పుడైనా గాలికోసం దీనిని ధరించొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..