Hyderabad: రంజాన్ మాసంలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో డెలివరైన హలీం, బిర్యానీలు.. ఎన్నంటే

రంజాన్ మాసం అంటే ముస్లీంలకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేలు కలయికే ఈ రంజాన్ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దానధర్మాలతో సాగుతుంది. ఈ మాసంలో ముస్లింలు సూర్యోద‌యానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం లాలాజలం కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు.

Hyderabad: రంజాన్ మాసంలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో డెలివరైన హలీం, బిర్యానీలు.. ఎన్నంటే
Biryani
Follow us
Aravind B

|

Updated on: Apr 22, 2023 | 11:50 AM

రంజాన్ మాసం అంటే ముస్లీంలకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేలు కలయికే ఈ రంజాన్ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దానధర్మాలతో సాగుతుంది. ఈ మాసంలో ముస్లింలు సూర్యోద‌యానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం లాలాజలం కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు. వయస్సులో భేదం లేకుండా చిన్నాపెద్దా భక్తి శ్రద్ధలతో ఈ దీక్షలో పాల్గొంటారు. అయితే ఈసారి రంజాన్ మాసంలో బిర్యానీలు, హలీంలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు స్విగ్గిలో దాదాపు పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీంలు డెలివరీ అయ్యాయి. ఈ విషయాన్ని స్వగ్గీ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది రంజాన్ మాసం కంటే ఈఏడాది 20 శాతం అధికంగా ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు జరిగాయి.

చికెన్ బిర్యానీ, హలీంతో పాటు సమోసాలు, భాజియా, మల్పువా, ఫిర్ని, రబ్ది లాంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయని.. మెజార్టీ మాత్రం హలీం, బిర్యానీలకే వచ్చిందని స్విగ్గీ స్పష్టం చేసింది. ఇఫ్తార్ సమయంలో పిస్తా హౌస్ హలీం, ప్యారడైస్ బిర్యాని, మెహ్‌ఫిల్ రెస్టారెంట్ల నుంచి హైదరాబాదీలు ఎక్కువగా ఆర్డర్లు చేశారు. ఉపవాసాలు చేస్తున్న ముస్లీంలు తమ దీక్ష విరమించేందుకు స్విగ్గీ లాంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకే ఎక్కవ మొగ్గు చూపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం