AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోడి పిల్లలకు ‘అమ్మ ప్రేమ’ను పంచిన పిల్లి.. నెటిజన్లను కట్టిపడేస్తున్న దృశ్యాలు.. మీరూ ఓ సారి చూసేయండి..

Cat Parenting Chicks: సర్వసాధారణంగాపిల్లులు తమ పిల్లలను కంటాయి. అలాగే కోళ్లు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. పొదిగిన తర్వాత గుడ్ల నుంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. అంతే కదా.. అయితే ఎక్కడైనా పిల్లి కోడి గుడ్లను పొదుగుతుందా..? కోడి..

Watch Video: కోడి పిల్లలకు ‘అమ్మ ప్రేమ’ను పంచిన పిల్లి.. నెటిజన్లను కట్టిపడేస్తున్న దృశ్యాలు.. మీరూ ఓ సారి చూసేయండి..
Cat Parenting Chicks
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 22, 2023 | 10:46 AM

Share

Cat Parenting Chicks: సర్వసాధారణంగాపిల్లులు తమ పిల్లలను కంటాయి. అలాగే కోళ్లు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. పొదిగిన తర్వాత గుడ్ల నుంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. అంతే కదా.. అయితే ఎక్కడైనా పిల్లి కోడి గుడ్లను పొదుగుతుందా..? కోడి గుడ్లను పిల్లి పొదగడం ఏమిటని కొట్టి పడేయకండి. అందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అవును, ఆ వైరల్ వీడియోలో ఒక పిల్ల తన పొట్ట కింద కొన్ని కోడి గుడ్లను పెట్టుకుని పొదగడమే కాదు, అవి పిల్లలుగా బయటకు వచ్చిన తర్వాత కూడా వాటి ఆలనాపాలనా చూసుకుంటుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఇది ఎలా సాధ్యం.. అసలు ఈ వీడియో నిజమేనా..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల గురించి చెప్పాలంటే.. ముందుగా ఆ పిల్లి తన పొట్ట కింద కొన్ని గుడ్లను పెట్టుకుని పొదుగుతుంది. ఇదిలా ఉండగా ఒక సారి తన యజమాని ఒక గుడ్డును తీసుకోబోతే.. ఆమె  చేతిని నెట్టేసి మరీ గుడ్డును తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అవి కాస్త పిల్లలుగా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వాటికి ముద్దాడడం, తనతోనే పడుకోబెట్టుకుని నిద్రపుచ్చడం కూడా చేసింది. అలా అవి కాస్త పెద్ద కూడా అయ్యాయి. అప్పుడు కూడా ఆ తల్లి పిల్లి వాటిిన వదలకుండా వాటితోనే గడిపింది. ఇలా సాగిన ఈ వీడియో సరిగ్గా aflock2021 అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాలుగా ఆ పిల్లిలోని అమ్మతనాన్ని ప్రశంసిస్తున్నారు. ‘అమ్మతనం అనేది వర్ణనాతీతమైన అనుభూతి’ అని ఒకరు.. ‘ఏ జీవి అయినా అమ్మప్రేమ విషయంలో తన పిల్లలకు  ఎటువంటి లోటు కలగనివ్వదు’ అని మరొకరు రాసుకొచ్చారు. ఇంకో నెటిజన్ అయితే ‘సోషల్ మీడియాలో నేను చూసిన వీడియోలలో ఇది చాలా బెస్ట్ వీడియో’ అని కామెంట్ చేశారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు తమతమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోకు ఇప్పటివరకు 40 వేల లైకులు, 5 లక్షల 76వేలకు పైగా వీక్షణలు లభించారు. ఇంకా పలువురు నెటిజన్లు వీడియోను తమ సన్నిహితులకు షేర్ కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..