అక్షయ తృతీయ పర్వదినం..! బంగారం కొనుగోలుపై నియమాలేంటో తెలుసా..?

ఆరోజు స్వర్ణం కొంటే అన్నిరకాలుగా శుభం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. అందుకే, ఎంతో కొంత బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నారు. ఆ నమ్మకాన్నే కంటిన్యూ చేస్తూ... జ్యుయలరీ షాపులకు క్యూ కట్టారు జనాలు. అందుకు తగ్గట్టే వెరైటీ డిజైన్లతో... కళ్లు జిగేలుమనే సరుకుతో.. సిద్ధంగా ఉన్నారు గోల్డ్‌ షాప్‌ నిర్వాహకులు. అయితే, అక్షయతృతీయ నాడు బంగారం కొనాలని శాస్త్రంలో ఉందా?

అక్షయ తృతీయ పర్వదినం..! బంగారం కొనుగోలుపై నియమాలేంటో తెలుసా..?
Akshaya Tritiya
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 22, 2023 | 8:34 AM

అక్షయ తృతీయ.. ఈ పేరు వినగానే చాలామందికి బంగారం గుర్తొస్తుంది. ఆరోజు స్వర్ణం కొంటే అన్నిరకాలుగా శుభం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. అందుకే, ఎంతో కొంత బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నారు. ఆ నమ్మకాన్నే కంటిన్యూ చేస్తూ… జ్యుయలరీ షాపులకు క్యూ కట్టారు జనాలు. అందుకు తగ్గట్టే వెరైటీ డిజైన్లతో… కళ్లు జిగేలుమనే సరుకుతో.. సిద్ధంగా ఉన్నారు గోల్డ్‌ షాప్‌ నిర్వాహకులు. అయితే, అక్షయతృతీయ నాడు బంగారం కొనాలని శాస్త్రంలో ఉందా? అంటే .. అలాంటి ఎక్కడా లేదంటున్నారు కొందరు సిద్ధాంతులు. అక్షయ తృతీయ మంచి రోజే అయినప్పటికీ.. ఆరోజున స్వర్ణం కొనుగోలు చేయాలన్న నియమమేమీ లేదంటున్నారు. ఇదంతా వ్యాపారం పెరగడానికి కొందరు చేస్తున్న ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు.

నిజానికి, అక్షయ తృతీయ నాడు… తోచినంత దానధర్మాలు చేయాలన్నది మరికొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. పూర్వకాలంలో డబ్బున్న వారు.. బంగారాన్ని దానం చేసే వారనీ… అదేంటో ఇప్పుడు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకుంటున్నారంటున్నారనీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దానం చేయాలో, కొని దాచి పెట్టుకోవాలో… ఈ రెండింట్లో ఏది కరెక్టనే విషయంలో స్పష్టత లేకున్నా, అక్షయ తృతీయ సందర్భంగా బంగారుదుకాణాలు మాత్రం దగదగలాడుతున్నాయి. కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.

వాస్తవానికి, అక్షయ తృతీయ రోజున మంగళకర కార్యాలు చేయడం, కొనుగోళ్లు చేయడం శుభమని చాలామంది భావిస్తుంటారు. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు దానధర్మాలు చేయడం వల్ల కూడా అక్షయ పుణ్యఫలం లభిస్తుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవీ పూజ కూడా చేపడతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే