ఈసారి సమ్మర్… చాలా డేంజర్ గురూ!..ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ

2016 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. బలమైన ఎల్‌నినోనే దీనికి కారణంగా చెబుతారు. నాటి ఎల్‌నినో ప్రభావం ఎనిమిదేళ్లుగా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది 2016తో పోల్చదగ్గ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చనేది భయపెడుతున్న సూచన.

ఈసారి సమ్మర్... చాలా డేంజర్ గురూ!..ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Summer
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 22, 2023 | 8:14 AM

కంటికి కనిపించకుండానే కోట్లాది మందిని కబళించింది కోవిడ్ మహమ్మారి. అలాగే కనిపించని మరో మహమ్మారి మన దేశాన్ని ఆక్రమించబోతోంది. ఆ భూతం పేరు ఎండవేడిమి. హీట్‌వేవ్ కారణంగా ఇండియాలో దాదాపు 90 శాతం భూభాగం డేంజర్‌జోన్‌లో పడింది. దీనికి కారణం ఏంటనే కోణంలో శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. ఆలోగానే… మిడ్ సమ్మర్లోకి ఎంట్రీ ఇస్తున్నాం మనం. మండే సూరీడు ఈసారి ఎంతమంది ఉసురు తియ్యబోతున్నాడో ఊహించుకోడానికే జడుసుకోవాల్సిన పరిస్థితి. నడినెత్తినెక్కి సూరీడు చేస్తున్న నాట్యానికి పిట్టల్లా రాలిపోతున్నారు జనం. నవీ ముంబైలో ఒక బహిరంగ సభలో ఏకంగా 14 మందిని మింగేసింది వడదెబ్బ. 600 మంది ఇప్పటికీ ఆస్పత్రి బెడ్లమీదే ఉన్నారు. 42 డిగ్రీల మండుటెండ… మిడతల్లా మాడిపోయిన జనం…. ఎండాకాలం చరిత్రలో ఇదే ఆల్‌ టైమ్ రికార్డ్.

ఏప్రిల్‌ నెలలోనే ఇంత యాతనుంటే…. ఇక మే, జూన్‌ మాసాలొస్తే పరిస్థితేంటి… మంటల్లో మునుగుడేనా… మనుగడ లేనట్టేనా? ఇండియాలో ఎండలు ఈసారి మామూలుగా ఉండవనే ముందస్తు హెచ్చరికలు భారీగా వినిపిస్తున్నాయి. రాబోయే ఎండలపై కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనాన్ని చూస్తే గుండెలు మండిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. రాబోయే మూడునెలల్లో ఇండియాలో హీట్ వేవ్‌లు తరచుగా తీవ్రరూపం దాల్చబోతున్నాయి. వాతావరణంలో మార్పులే దీనిక్కారణం అంటున్నారు. దేశం మొత్తంలో 90 శాతం ప్రాంతాలు హీట్ వేవ్‌ల ప్రభావంతో ప్రమాదంలో పడబోతున్నాయి.

ముఖ్యంగా రాజధాని ఢిల్లీ ఇప్పటికే డేంజర్‌ జోన్‌లో ఉంది. హస్తినను ఈసారి సమ్మర్ సీజన్ తీవ్రంగా దెబ్బతియ్యబోతోంది. వాతావరణ మార్పుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సక్సెస్ కాకపోవడంతో భారీ ఉష్ణోగ్రతల తాకిడి నుంచి తప్పించుకోలేకపోతోంది ఢిల్లీ నగరం. ఎండ తీవ్రత అనేది ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియాలంటే ఒక్కసారి చరిత్ర పేజీలు తిరగెయ్యాల్సిందే. 1971 నుంచి ఇప్పటివరకూ దాదాపు 706 సార్లు వడదెబ్బతో తల్లడిల్లింది ఇండియా. గత 30 ఏళ్లలో భారీ ఉష్ణోగ్రతల తాకిడికి 24 వేల మంది మృత్యువాతన పడ్డారు. ఈ ఏడాది వేసవి మరణాలు పెరిగినా పెరగొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎల్‌ నినో రీఎంట్రీ వల్లే ఎండలిలా మండిపోతున్నాయట. ఎల్ నినో అంటే… పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం. ఈ వైపరీత్యం ప్రతి 12 ఏళ్లకొకసారి ఖచ్చితంగా జరుగుతుంది. దీని ఫలితం ఏంటంటే… ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం. ఇటువంటి అసాధారణ వాతావరణం ఈసారి జూన్ ఆఖర్లో స్పష్టంగా కనిపించవచ్చట. 2016 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. బలమైన ఎల్‌నినోనే దీనికి కారణంగా చెబుతారు. నాటి ఎల్‌నినో ప్రభావం ఎనిమిదేళ్లుగా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది 2016తో పోల్చదగ్గ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చనేది భయపెడుతున్న సూచన.

మండే ఎండలు మనల్నే కాదు… మన ప్రభుత్వాల పురోగతిని కూడా శాసిస్తాయి. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాల ఛేదనలో ఇండియా చతికిలబడిందంటే… ప్రధాన కారణాల్లో హీట్‌వేవ్ కూడా ఒకటి. వేడిగాలుల కారణంగా పంటల దిగుబడి తగ్గుతుంది. ఆహారధాన్యాల కొరత ఏర్పడి ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరుగుతుంది. దాని మూలంగా దేశ ఆర్థిక ప్రగతి మందగిస్తుంది. బైటికెళ్లి పనిచేసుకునే సామర్థ్యం జనంలో 15 శాతం తగ్గిపోతుంది. దాదాపు 48 కోట్ల మంది జనాభాలో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతాయి. వరుసగా ఇదే వేడి కొనసాగితే 2030 నాటికి జీడీపీలో 4.5 శాతం వరకు నష్టపోవచ్చట.

ఈ సంవత్సరంలో సమ్మర్ సీజన్‌ చాలా ప్రమాదకరం అని హెచ్చరికలు చేసింది ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ కూడా ఎలర్టయింది. హీట్‌వేవ్‌ని ఫేస్ చెయ్యడం ఎలా అనే సబ్జెక్ట్ మీద పాలసీలు కూడా రాసుకుంది. అహ్మదాబాద్ లాంటి కొన్ని కార్పొరేషన్లయితే ఎండల తీవ్రతనుంచి బతికి బైటపడ్డానికి ప్రత్యేక బడ్జెట్లే కేటాయించుకున్నాయి. సో… మండే ఎండలు.. ఈ ఏడాది సాధారణ జనజీవితాల్ని దారుణంగా దెబ్బతియ్యబోతున్నాయన్నది క్లియర్. సో… బివేర్ ఆఫ్ దిస్ ఎండాకాలం… మండే కాలం.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!