- Telugu News Photo Gallery Business photos These Indian Billionaire tycoon daughters are Leading The Business World
Indian Billionaires Daughters: బిజినెస్ ప్రపంచంలో అగ్రగాములైన ఈ కుబేరుల కూతుళ్లూ వ్యాపారవేత్తలే..!
ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో అపర కుబేరులుగా నిలిచిన దేశీ వ్యాపారవేత్తలు గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్తలు అదానీ, ముకేష్ అంబానీ వంటి వారు వ్యాపారాల్లో అగ్రగాములుగా నిలిచారు. ఐతే వీరి సంతానం కూడా తండ్రులకు ధీటుగా వ్యాపారంలో దూసుకుపోతున్నారని మీకు తెలుసా? ముఖ్యంగా భారత బిలియనీర్ల కూతుళ్లు వ్యాపార ప్రపంచంలో కోట్లాది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు./
Updated on: Apr 23, 2023 | 1:51 PM

ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో అపర కుబేరులుగా నిలిచిన దేశీ వ్యాపారవేత్తలు గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్తలు అదానీ, ముకేష్ అంబానీ వంటి వారు వ్యాపారాల్లో అగ్రగాములుగా నిలిచారు. ఐతే వీరి సంతానం కూడా తండ్రులకు ధీటుగా వ్యాపారంలో దూసుకుపోతున్నారని మీకు తెలుసా? ముఖ్యంగా భారత బిలియనీర్ల కూతుళ్లు వ్యాపార ప్రపంచంలో కోట్లాది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తున్నారు. గత 23 ఏళ్ల నుంచి ఇషా అంబానీ వ్యాపారంలో చురుగ్గా రానిస్తున్నారు. ఏప్రిల్ 2016లో ఇషా నాయకత్వంలో అజియోను ప్రారంభించడం జరిగింది.

బిస్లరీ చైర్మన్ రమేష్ చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్.. కూడా తన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. గత 24 ఏళ్ల నుంచి జయంతి కూడా తండ్రి పర్యవేక్షణలో బిజినెస్ నిర్వహిస్తున్నారు.

ఆటో కంపెనీ టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె డాక్టర్ లక్ష్మి.. తన తండ్రి వ్యాపారంలో విజయవంతంగా రానిస్తోంది. టీవీఎస్ అనుబంధ సంస్థ అయిన సుందరం క్లేటన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో

భారతదేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు అయిన హెచ్‌సిఎల్‌కు రోష్ని నాడార్ మల్హోత్రా ఇటీవలే చైర్‌పర్సన్ అయ్యారు. అంతకు ముందు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ చైర్మన్‌గా వహించారు. రోష్నీ నాడార్ మల్హోత్రా నికర విలువ రూ. 36,800 కోట్లు. ఇండియాలో అత్యంత సంపన్న మహిళా సీఈవోల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.





























