- Telugu News Photo Gallery Business photos Maruti Suzuki Car: Bumper offer for car buyers.. Huge discount on these models..
Maruti Car: కారు కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. ఈ మోడళ్లపై భారీ తగ్గింపు..
కారు కొనుగోలుదారులకు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్‌లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కార్ల తయారీ కంపెనీలు అప్పుడప్పుడు కూడా తగ్గింపు ధరలతో ముందుకొస్తున్నాయి. వివిధ కార్ల మోడళ్లపై ఆటోమొబైల్ కంపెనీలు భారీ తగ్గింపు ఆఫర్లను విడుదల చేశాయి..
Updated on: Apr 23, 2023 | 3:14 PM

కారు కొనుగోలుదారులకు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్‌లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కార్ల తయారీ కంపెనీలు అప్పుడప్పుడు కూడా తగ్గింపు ధరలతో ముందుకొస్తున్నాయి.

వివిధ కార్ల మోడళ్లపై ఆటోమొబైల్ కంపెనీలు భారీ తగ్గింపు ఆఫర్లను విడుదల చేశాయి. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు అయిన మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ వాగన్ఆర్ 1.0 లీటర్ ఇంజన్ వేరియంట్‌లపై 30,000 రూపాయల విలువైన తగ్గింపును అందిస్తోంది.

జపాన్ ఆధారిత ఆటోమొబైల్ కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌పై కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది.

అలాగే Alto K10లో 55,000 రూపాయల విలువైన మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. అయితే, సెలెరియో CNG వేరియంట్‌లు, S-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్‌లపై కస్టమర్‌లు 45,000 రూపాయల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

మరోవైపు హోండా ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీపై 15,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలు నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి.





























