Twitter Blue Tick: ట్విటర్‌ బ్లూటిక్‌పై మస్క్‌ యూటర్న్‌..! సెలబ్రెటీల అకౌంట్లకు బ్లూటిక్‌ చెక్‌మార్క్‌

ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌లు ఒకప్పుడు వార్తల్లో నిలిచేవి. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వైరల్‌ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం పెయిడ్‌ సర్వీస్‌ సబ్‌స్క్రైబ్ చేసుకోని..

Twitter Blue Tick: ట్విటర్‌ బ్లూటిక్‌పై మస్క్‌ యూటర్న్‌..! సెలబ్రెటీల అకౌంట్లకు బ్లూటిక్‌ చెక్‌మార్క్‌
Celebrities Twitter Blue Tick
Follow us

|

Updated on: Apr 23, 2023 | 3:45 PM

ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌లు ఒకప్పుడు వార్తల్లో నిలిచేవి. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వైరల్‌ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం పెయిడ్‌ సర్వీస్‌ సబ్‌స్క్రైబ్ చేసుకోని ప్రముఖుల ట్విటర్‌ అకౌంట్లకు బ్లూ టిక్‌లను తొలగించింది. ఈ క్రమంలోనే బ్లూ టిక్ పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందేననే నిబంధన కూడా తీసుకొచ్చింది. దీనిపై తాజాగా ఎలన్ మస్క్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించనప్పటికీ సెలబ్రిటీలకు బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్దరించింది. ఈ విషయాన్ని పలువురు ప్రముఖులు స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాము డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోయినప్పటికీ, బ్లూ టిక్ పునరుద్దరించబడిందని వెల్లడిస్తున్నారు.

కనీసం ఒక మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న ట్విటర్‌ యూజర్లకు మాత్రమే బ్లూటిక్‌ను పునరుద్ధరించినట్లు, అటువంటి వారికి మాత్రమే మస్క్‌ మినహాయింపు ఇచ్చినట్లు రోలింగ్ స్టోన్‌ అనే మీడియా సంస్థ వెల్లడించింది. ఐతే 6.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు మాత్రం ఇప్పటి వరకు ప్రొఫైల్ పక్కన బ్లూటిక్‌ బ్యాడ్జ్‌ కనిపించకపోవడం గమనార్హం.

నిజానికి, ట్విట్టర్ అకౌంట్స్ బ్లూ టిక్‌ కోసం డబ్బులు చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చినప్పటికీ చాలా మంది యూజర్లు అందుకు నిరాకరిస్తున్నారు. ఐతే కొందరు మాత్రం డబ్బులు చెల్లించి బ్లూ టిక్ మార్క్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డబ్బు చెల్లించి సబ్‌స్కైబ్ చేసుకుకోని సెలబ్రిటీల ఖాతాల బ్లూ టిక్ మార్కును తొలగించనున్నట్టుగా ట్విట్టర్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని సెలబ్రిటీల ఖాతాల బ్లూ టిక్‌ మార్క్‌ను తొలగించింది. బాలీవుడ్ నటులు అలియా భట్‌, షారూఖ్ ఖాన్, క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ బిల్ గేట్స్ కూడా కొత్త అప్‌డేట్ కారణంగా బ్లూ టిక్‌లను కోల్పోయారు. అయినప్పటికీ అధికమంది సెలబ్రిటీలు డబ్బులు చెల్లించి ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో కొందరు ట్విట్టర్‌ తీరుపై మండిపడ్డారు. బ్లూ టిక్‌ తొలగించి మూడు రోజులు కూడా గడవకముందే కొందరు సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్దరించడం చర్చనీయాంశంగా మారింది. తాము బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బు చెల్లించనప్పటికీ సభ్యత్వం పొందినట్లు తమ ఖాతాల పక్కన చెక్‌మార్క్‌ చూపిస్తున్నట్లు పలువురు సెలబ్రెటీలు ట్వీట్లు చేశారు. దీంతో బ్లూటిక్ ఎవరికి, ఎందుకు వస్తుందో.. మిగతా వారికి ఎందుకు రావడం లేదో తెలియక యూజర్లు తికమకపడిపోతున్నారు. దీని వెనుక మతలబు ఏమిటన్నది వేచి చూడవల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.